ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: 10వేల దిగువకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 500కి దిగువనే కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే, టెస్టుల సంఖ్య తగ్గడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 30,515 నమూనాలను పరీక్షించగా.. 429 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 429 కరోనా కేసులు, 04 మంది మృతి
తాజాగా నమోదైన 429 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,53,192కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు మరణించగా, చిత్తూరు, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,208కి పెరిగింది.

ఏపీలో 10వేల దిగువకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1029 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,29,231కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 9,753 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,84,76,467 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 89 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 01, చిత్తూరులో 72, తూర్పుగోదావరిలో 89, గుంటూరులో 40, కడపలో 06, కృష్ణాలో 39, కర్నూలులో 03, నెల్లూరులో 85, ప్రకాశంలో 43, శ్రీకాకుళంలో 09, విశాఖపట్నంలో 34, విజయనగరంలో 01, పశ్చిమగోదావరిలో 07 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,91,827, చిత్తూరులో 2,44,480 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,788) కరోనా కేసులున్నాయి.

దేశంలోనూ భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 9,91,676 నమూనాలన పరీక్షించగా 20,799 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. నిన్నటితో పోల్చితే(22,842) కొత్త కేసులు తక్కువగా కావడం గమనార్మం. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,38,34,702కు చేరింది. ఆదివారం 180 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,48,997కి చేరింది. ఆదివారం 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,31,21,247కి పెరిగింది. రికవరీ ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది. ప్రస్తుతం దేశంలో 2,64,458 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 90.79,32,861కు చేరింది.












Click it and Unblock the Notifications