సీఎం జగన్ కు 47 లక్షల కుటుంబాల మద్దతు - సర్వే రిపోర్టు..!!
రానున్న ఎన్నికలకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ శ్రేణులను ప్రతీ ఇంటికి పంపిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరిస్తూ ఒక విధంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచార యాత్రలోనే ప్రజా స్పందన తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజుల పాటు నిర్వహించిన మెగా పీపుల్స్ సర్వే ఫలితాలను మంత్రులు విడుదల చేసారు. అందులో జగన్ పాలనకు అనూహ్య స్పందన కనిపించింది. రికార్డు స్థాయిలో మద్దతు వచ్చింది.
రికార్డు నమోదు: జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం సరికొత్త రికార్డును నమోదు చేసిందని మంత్రి జోగి రమేష్ చెప్పారు. గడప గడపకు వెళ్లి జగనన్న సైన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమానికి మద్దతుగా వారం రోజుల్లోనే 47 లక్షలకు పైగా కాల్స్ వచ్చారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం విస్తృతంగా ఇంటింటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, గృహ సారధులు వెళ్తున్నారని చెప్పారు.
మా నమ్మకం నువ్వే జగన్‌అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారని తెలిపారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జనం సీఎం వైయస్ జగన్ స్టిక్కర్లను వాకిళ్లకు ఇష్టంగా అతికించుకుంటున్నారని తెలిపారు. జగనన్న సైన్యం రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్తున్నారని చెప్పారు. వారంలో 61 లక్షల గృహాలను సందర్శిస్తే 47 లక్షలకు పైగా మద్దతు తెలిపారని వెల్లడించారు.

మిస్డ్ కాల్ తో మద్దతు: వారం రోజుల సమయంలోనూ అనూహ్య మద్దతు కనిపించిందని మంత్రులు వెల్లడించారు. జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే వారి నుంచి మిస్డ్ కాల్ కోరుతున్నామని.. స్వచ్ఛందంగా 82960 82960 నంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారు. చరిత్రపుటల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు, సీఎం వైయస్ జగన్ పట్ల విశ్వాసం, దీవెనలు మెండుగా ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.
ఇదేదో మొక్కుబడి సర్వే కాదు..జగనన్న సైన్యం ప్రజల వద్దకు వెళ్లి, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను చెప్పి వాళ్ల మద్దతుతో సర్వే చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు వెలువెత్తుతోందని చెప్పారు. మా భవిష్యత్ జగనన్నే, రాష్ట్ర భవిష్యత్ జగనన్నే, మన పిల్లల భవిష్యత్ జగనన్నతోనే సాధ్యమని ఇప్పడానికి ఇంతకన్న పెద్ద ఉదాహరణ ఉండదని మంత్రి జోగి రమేష్ వివరించారు.

ఫలితాలు సాక్ష్యం: జగన్ నిజమైన అభివృద్ధి చేశారని చెప్పేందుకు మెగా పీపుల్స్ సర్వే మొదటివారం ఫలితాలు సాక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గణాంకాలతో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. మొదటివారంలోనే ఇన్ని ఫలితాలు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.
సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, చివరకు మా పార్టీకి ఓటు వేయని వారిదగ్గరకు కూడా వెళ్లేందుకు సాహసం చేస్తున్నామంటే ఎంత పారదర్శకతతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో గమనించాలని మంత్రి సురేష్ కోరారు. రెండో వారం మెగా పీపుల్స్ సర్వే ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications