కంబ్యాక్ వెనుక పెద్ద ప్లానే.. సమంత అసలు ట్విస్ట్ అదేనా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుని కేవలం తన పేరుతోనే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల నటీమణులలో సమంత ఒకరు. 'ఓ బేబీ', 'యశోద' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సినిమాను ఒంటిచేత్తో నడిపించిన బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకోగలనని సమంత నిరూపించింది. గతంలో వచ్చిన 'శాకుంతలం'ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఆ తర్వాత ఆమె నటనకు కొంతకాలం విరామం ప్రకటించినప్పటికీ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సమంత కంబ్యాక్ సినిమాగా వస్తున్న 'మా ఇంటి బంగారం'పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో ఈ సినిమాపైనే అత్యధిక బజ్ ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ శరవేగంగా ముగుస్తుండటమే దీనికి నిదర్శనం.
ఓవర్సీస్‌లో 'మా ఇంటి బంగారం' సంచలనం
ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ తన సత్తా చాటుతోంది. నార్త్ అమెరికాలో ప్రి-సేల్స్ ఇప్పటికే 1.5 లక్షల డాలర్లు దాటడం విశేషం. యూఎస్ మార్కెట్లో తనకు గల బలమైన పట్టును సమంత మరోసారి నిరూపించుకుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్లోనే మిలియన్ డాలర్ల మార్క్‌ను ఈజీగా టార్గెట్ చేయవచ్చని.. ఫుల్ రన్‌లో 2 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం అంటే అది నిజంగా అద్భుతమైన విషయమే.

సమంత సీక్రెట్ రోల్.. నక్సలైట్‌గా నటన?
ఈ సినిమాపై ఓ విషయం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇందులో సమంత పోషిస్తున్న పాత్ర గురించిన కొన్ని ఊహాగానాలు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సమంత ఓ నక్సలైట్ పాత్రలో కనిపిస్తారని.. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆమె నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. గతంలో సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' వెబ్ సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఇలాంటి పాత్రలోనే నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అయితే ఒకవేళ 'మా ఇంటి బంగారం'లో వస్తున్న వార్తలు నిజమైతే, ఈసారి ఆమె నెగెటివ్ రోల్ కాకుండా ఒక పాజిటివ్ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు.
Maa Inti Bangaaram 👌💥
— H A N U (@HanuNews) June 17, 2026
North America Premiere advance Sales already crossed 150K mark. Premiers tomorrow. Sensational opening on the cards. #MaaIntiBangaaram
AP/TG kuda bookings adiripoyayi.. 10K plus tickets in Last 24 hours.. 🔥
Openings adiri pothunnayi..… pic.twitter.com/65U2wFfOh9
అబిమానుల రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది?
ప్రస్తుత కాలంలో నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ ఉన్న పాత్రలపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి దర్శకుడు ఈ పాత్రను ఎంతవరకు సానుకూలంగా, ఎమోషనల్ గా ప్రజెంట్ చేశారనే దానిపై ప్రేక్షకుల స్పందన ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సమంత నక్సలైట్ పాత్రపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నందున, సమంత అసలు ఎలాంటి పాత్రలో మెప్పించబోతోందో తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే!












Click it and Unblock the Notifications