జులై నుంచి ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే

శని గ్రహ సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. న్యాయాధిపతి, కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శని దేవుడు జులై నెలలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. జులై 27వ తేదీన శని గ్రహం మీనరాశిలో వక్రగతిలోకి ప్రవేశించనుంది. సాధారణంగా శని వక్రగతి అనగానే చాలామంది ఆందోళన చెందుతుంటారు. కానీ, జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. శని వక్రగతి ఎప్పుడూ కీడు చేయదు. వ్యక్తులు చేసే సత్కర్మలను బట్టి ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

మరీ ముఖ్యంగా, శని వక్రగతితో పాటే అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన 'శశ మహాపురుష రాజయోగం' కూడా ఏర్పడబోతోంది. ఈ రెండు అరుదైన ఖగోళ మార్పుల కలయిక వల్ల జులై నుంచి ఈ క్రింది నాలుగు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరిపోవడమే కాకుండా, ఊహించని ఆర్థిక లాభాలతో వీరు బంపర్ జాక్‌పాట్ కొట్టబోతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాల గురించి తెలుసుకుందాం.

Horoscope From July Onward These 4 Zodiac Signs Will Attract Success Prosperity Like Never Before

తులా రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

తులా రాశి వారికి ఈ శశ రాజయోగం ఐదవ స్థానంలో ఏర్పడుతుండటం వల్ల వీరికి అమితమైన శుభఫలితాలు దక్కుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు, విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలం. వారు ఆశించిన మంచి వార్తలు వింటారు. ఎక్కడో చిక్కుకుపోయిన పాత బకాయిలు, రావాల్సిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందుతాయి. ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడుతుంది. లాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి ఈ సమయంలో పెళ్లి ఘడియలు దగ్గరపడతాయి. వివాహ యోగం బలంగా ఉంది.

వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత

వృశ్చిక రాశి వారికి శని దేవుని అనుగ్రహంతో పెద్ద పెద్ద కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో చాలా రోజులుగా నడుస్తున్న కలహాలు, మనస్పర్థలు ముగిసిపోతాయి. తీవ్ర మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభించి ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు కేసులు లేదా పాత ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త భూములు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఆఫీసులో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి.

వృషభ రాశి వారికి పదోన్నతులు

వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడికి, శని దేవుడికి మధ్య మంచి మిత్రత్వం ఉంది. ఈ కారణంగా శని వక్రగతి వృషభ రాశి వారికి రాజయోగాన్ని తలపిస్తుంది.ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్నత పదవులు లభిస్తాయి. జీతాలు విపరీతంగా పెరుగుతాయి. కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిలిచిపోయిన పాత ప్రాజెక్టులు, వ్యాపారాలు మళ్లీ ఊపందుకుంటాయి. ముఖ్యంగా భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు చేసే వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాల పంట పండుతుంది. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

మిథున రాశి వారికి అడ్డంకులు తొలగిపోతాయి

శశ మహాపురుష రాజయోగం వల్ల మిథున రాశి వారి జీవితంలో అదృష్టం, ఆనందం వెల్లివిరుస్తాయి. గత కొంతకాలంగా మీ పనులకు వస్తున్న ఆటంకాలు, సవాలుగా మారిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కల నెరవేరుతుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. లగ్జరీ లైఫ్‌ను ఆస్వాదిస్తారు. కొత్త ఇల్లు, వాహనాలు కొనాలనే మీ ప్రయత్నాలు ఈ కాలంలో సఫలమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+