అప్రమత్తం కాకుంటే నష్టపోతాం - కేటీఆర్ హెచ్చరిక..!!
పార్టీ కేడర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తిరిగి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతి బిఎల్ఎ అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హత గల వ్యక్తుల ఓటర్లు తొలగించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేశారు.
ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎస్ ఐ ఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత నమోదు అంశాలపై కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో గజదొంగ పాలన కొనసాగుతుంటే.. ఖమ్మం జిల్లాలో ఘరానా దొంగల పాలన కొనసాగుతుందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. దాచుకోవడం దోచుకోవడం తప్ప జిల్లా అభివృద్ధికి వారు పాటుపడిందేమి లేదని స్వార్థ ప్రయోజనాల కోసమే పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఒక మంత్రి భూముల కబ్జాలకు పాల్పడుతుంటే, మరో మంత్రి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారన్నారు. ఇక ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ప్రతిరోజు కేసీఆర్ అప్పులు చేశాడని మోరుగుతున్న నాయకులు ఎందుకు చేశారో బదులిచ్చారు.

సర్ పై కేడర్ అప్రమత్తంగా ఉండాలి
కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సజీవ సాక్షాలుగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో లక్షల కోట్లు అప్పుచేసి ఏమి అభివృద్ధి చేసిందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ దందాలకు పాల్పడుతూ అనేక అక్రమాలకు ఊతమిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను సభా వేదికపై ప్రదర్శించారు. మరికొద్ది రోజుల్లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతి బిఎల్ఎ అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హత గల వ్యక్తుల ఓటర్లు తొలగించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేశారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications