50 రకాల వంటకాలతో అరుణ్ జైట్లీకి చంద్రబాబు పసందైన విందు

అమరావతి: అమరావతి పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు విందు ఇచ్చారు. విజయవాడ గేట్ వే హోటల్‌కు చేరుకున్న జైట్లీకి చంద్రబాబు పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

ఈ విందుకు జైట్లీతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు కంభంపాటి హరిబాబు, కేశినేని నాని తదితరులు హాజరయ్యారు.

50 varieties of food menu for Arun Jaitley

ఈ విందులో 50 రకాల వంటకాలతో జైట్లీ కోసం సిద్ధం చేశారని తెలుస్తోంది. వీటిని చంద్రబాబు పసందుగా తయారు చేయించారు. జైట్లీకి ఇష్టమైన బెండి ఆమ్‌చూర్, ఏపీ స్పెషల్ ఉలవచారు, గోంగూర పచ్చడి, షుగర్ ఫ్రీ జున్ను, పూతరేకులు, బొబ్బట్లు, పీతలకూర, గోంగూర మటన్, అరటి ఆకుల్లో పత్రి ఫిష్, టైగర్స్ ఫ్రాన్స్ వేపుడు, నాటుకోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, గారెలు, సీమల స్పెషల్ రాగి సంకటి తదితరాలు మెనూలో ఉన్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ అంశాలను అమలులోకి తేవాలని జైట్లీని కోరారు. దీనిని త్వరగా తేవాలన్నారు. ఇప్పటికే విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, జగన్‌లు హోదా కోసం సభలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+