ఏపీలో భారీగా క్షీణించిన కరోనా పాజిటివ్ కేసులు: గుంటూరులో ఎక్కువ, కర్నూలులో తక్కువ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా క్షీణించాయి. గత 24 గంటలు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1000 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉంది. మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది.

ఏపీలో కొత్తగా 545 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 545 కరోనా పాజిటివ్ కేసులు

గత 24 గంటల్లో 47,130 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 545 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,59,863కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 10 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,948కు చేరింది. కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులు..

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులు..

ఇక జిల్లావారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 19, చిత్తూరులో 32, తూర్పుగోదావరిలో 104, గుంటూరులో 117, కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరులో 30, ప్రకాశంలో 25, శ్రీకాకుళంలో 19, విశాఖటప్నంలో21, విజయనగరంలో 17, పశ్చిమగోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.

13వేలకు యాక్టివ్ కేసులు

13వేలకు యాక్టివ్ కేసులు

గత 24 గంటల వ్యవధిలో 1390 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,39,521 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,394 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,62,220 కరోనా నమూనాలను పరీక్షించారు.

Recommended Video

    #Telangana : తెలంగాణలో Corona సెకండ్ వేవ్ అవకాశాలు.. రాజధాని Hyderabad లో వైరస్ ఉధృతి!
    దేశంలోనూ భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలోనూ భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

    ఇక దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 44,059 కరోనా కేసులు నమోదుయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు పెరిగింది. ఇదే సమయంలో 41,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 85,62,641కి చేరింది. రికవరీ రేటు 93.68శాతంగా ఉంది. గత 24 గంటల్లో 511 మంది కోవిడ్ బారినపడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,738కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,43,486 యాక్టివ్ కేసులున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+