ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కోలుకున్నవారే ఎక్కువ, యాక్టివ్ కేసుల క్షీణత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కరోనా మహమ్మారి తగ్గుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత పది రోజులుగా రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుకుంటూ వస్తోంది. కరోనా పరీక్షలు భారీ స్థాయిలో చేస్తున్నప్పటికీ కొత్త కేసుల్లో మాత్రం తగ్గుదల నమోదవుతోంది. దీంతో ఏపీ కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటోందని చెప్పవచ్చు.

ఏపీలో కొత్తగా 5487 కొత్త కేసులు, 37 మరణాలు
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66,121 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5487 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,81,161కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా, ఒక్క రోజులో కరోనాతో చికిత్స పొందుతూ 37 మంది మరణించారు.

ఏపీ జిల్లాల వారీగా మరణాలు
జిల్లాల వారీగా మరణాలను గమనించినట్లయితే.. ప్రకాశంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పోగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరులో జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5745కు చేరింది.

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులు
ఇక జిల్లాల వారీగా నమోదైన కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే..
అనంతపురంలో 310, చిత్తూరులో 329, తూర్పుగోదావరిలో 1010, గుంటూరులో 538,
కడపలో 271, కృష్ణాలో 97, కర్నూలులో 113, నెల్లూరులో 489, ప్రకాశంలో 634,
శ్రీకాకుళంలో 286, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 362,
పశ్చిమగోదావరిలో 903 కేసులు నమోదయ్యాయి.

రికవరీ పెరుగుతోంది.. తగ్గుతున్న యాక్టివ్ కేసులు
ఇక గత 24 గంటల వ్యవధిలో 7210 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం 63,116 యాక్టివ్ కేసులున్నాయి. 6,12,300 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 56,66,323 నమూనాలను పరీక్షించడం జరిగింది. కాగా, దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఏపీనే ఉంది. అయితే, అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఏపీలో యాక్టివ్ కేసుల క్షీణత ఎక్కువగా ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications