ఘోర రోడ్డ ప్రమాదం: ఆరుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

Subscribe to Oneindia Telugu

తూర్పుగోదావరి: జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం మూడేకర్రు మహాలక్ష్మీనగర్‌ వద్ద శనివారం తెల్లవారుజామున లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళలే.

అల్లవరానికి చెందిన సుమారు 13 మంది ఆత్రేయపల్లి మండలంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. మార్గ మధ్యంలో ఓ లారీ వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని అమలాపురంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. 

6 killed as tipper rams into auto in AP

మృతులను చీకట్ల నాగమణి(46), పేరాబత్తుల అనంతలక్ష్మి(40), పి.భవాని(25), పులిమి అనంతలక్ష్మి(40), పి.పార్వతి(48), పి.దుర్గ(60)గా గుర్తించారు. రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా అమలాపురం-రావులపాలెం రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Six women were killed and six others injured after a speeding tipper rammed into their auto at Modekurru in East Godavari district of Andhra Pradesh in the early hours today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి