ఛార్జీషీట్ దాఖలులో సీఐడీ విఫలం, అగ్రిగోల్డ్ చైర్మన్ సహా 6గురు డైరెక్టర్లకు బెయిల్ మంజూరు
మచిలీపట్నం: అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు మంగళవారం మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఛార్జీషీట్ దాఖలు చేయడంలో సీఐడీ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా, అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసిన ప్రజల సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన సంస్థ యాజమాన్యం చేతులెత్తేసిన విషయం తెలిసిందే. సంస్థ ఆస్తులను అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా, ఇటీవల అగ్రిగోల్డ్ కేసు మరో మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఆస్తులను కొనుగోలు చేసేందుకు జిఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. గతంలో వద్దని చెబుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. అగ్రిగోల్డ్ 10 ఆస్తుల విలువను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అగ్రిగోల్డ్ సంస్థను హైకోర్టు ఆదేశించింది.
అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు జీ-ఎస్సెల్ గ్రూప్ అంతకుముందు ఆసక్తి చూపించి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అయితే ఆ తర్వాత ఇటీవల మళ్లీ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం. ఆ మేరకే గతంలో దాఖలు వేసిన పిటిషన్‌ను జీ-ఎస్సెల్ గ్రూప్ ఉపసంహరించుకుంది.












Click it and Unblock the Notifications