7 మండలాలను ఏపికివ్వొద్దు: కేంద్రానికి కిషన్(పిక్చర్స్)

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పరిధిలోని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపొద్దని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఏపిలో విలీనం చేసే బదులు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఈ మండలాలను కేంద్రం తమ స్వాధీనంలో పెట్టుకుని నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించటంతోపాటు పునరావాసం కల్పించిన అనంతరం ముంపునకు గురికాని ప్రాంతాలను తెలంగాణకు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం బిజెపి జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
ఏడు మండలాల విలీనాన్ని ఉపసంహరించుకునే అంశంపై మొదట పార్టీలో చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమకు హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఏడు మండలాలను ఏపిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురి అవుతున్న ఏడు మండలాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా లేరని కిషన్ రెడ్డి చెప్పారు. ఏడు మండలాలలోని గ్రామాల ప్రజలు తెలంగాణలోనే ఉంటామని గ్రామ సభల్లో తీర్మానాలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించాలన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపొద్దని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఏపిలో విలీనం చేసే బదులు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఈ మండలాలను కేంద్రం తమ స్వాధీనంలో పెట్టుకుని నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించటంతోపాటు పునరావాసం కల్పించిన అనంతరం ముంపునకు గురికాని ప్రాంతాలను తెలంగాణకు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెండు వందల ఎకరాల భూమి కేటాయిస్తే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారని ఆయన తెలిపారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఏడు మండలాల విలీనాన్ని ఉపసంహరించుకునే అంశంపై మొదట పార్టీలో చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమకు హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఏడు మండలాలలోని గ్రామాల ప్రజలు తెలంగాణలోనే ఉంటామని గ్రామ సభల్లో తీర్మానాలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించాలన్నారు. సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.

సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉండాలని వివిధ మంత్రిత్వ శాఖలను కోరటంతోపాటు పలు హామీలు కూడా సంపాదించామని కిషన్ రెడ్డి తెలిపారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జల వనరుల మంత్రి ఉమాభారతి, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రైల్వే మంత్రి సదానందగౌడ, ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, సమాచార శాఖ మంత్రి జవదేకర్, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తెలంగాణ రాష్ట్రం అభివృద్దికి ఆర్థిక సహాయం, ప్రాజెక్టులు అడిగామని తెలిపారు.

ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు తగ్గించటాన్ని ఉపసంహరించుకోవటంతోపాటు సీట్ల సంఖ్య పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెండు వందల ఎకరాల భూమి కేటాయిస్తే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేసేందుకు మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారని ఆయన తెలిపారు.
తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు స్మృతి ఇరానీ అంగీకరించారన్నారు. నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఐఐఎం ఏర్పాటు చేస్తామని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారని ఆయన వివరించారు. తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని రైల్వే మంత్రి సదానందగౌడ హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి వెంట పేరల చంద్రశేఖర్, లక్ష్మినారాయణ, ప్రేమేందర్ రెడ్డి, వెదిరె శ్రీరామ్‌లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+