Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతిజ్ఞ చేసిన సాయిరెడ్డి- రాజీనామా తరువాత ఫస్ట్ ట్వీట్..!!

Vijayasai Reddy: దేశ 76వ గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో కోలాహలం నెలకొంది. రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరు కానున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాటు పూర్తి చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగుతోంది.

76th Republic day Former MP Vijayasai Reddy first tweet after his resignation

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. రాజ్యంగ విలువలు.. అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయని అన్నారు. మన రాజ్యాంగ విలువలు, ఆదర్శాలను పరిరక్షించడానికి మరింత కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. అత్యంత శక్తిమంతమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం నిరంతరం శ్రమిస్తామని మాటిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర దేశం వర్ధిల్లడానికి మూలాధారం రాజ్యాంగమేనని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత గొప్ప గణతంత్ర దేశం నిర్మాణానికి పునాది పడిన రోజుగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య విలువలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

మన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను గౌరవించుకునే విలువైన సందర్భమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలు పరిరక్షిస్తానని, అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, బలమైన, సమ్మిళిత, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని సాయిరెడ్డి ప్రతిజ్ఞ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+