విశాఖలో స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ: ఎగిరిపడ్డ విద్యార్థులు: సీసీ కెమెరాల్లో..

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనేే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఉదయం విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ జంక్షన్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎనిమిది మంది విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్తోన్న ఓ ఆటోను వేగంగా ఢీకొట్టిందో లారీ. లారీ ఢీ కొట్టిన వెంటనే ఆటోలో నుంచి విద్యార్థులు ఎగిరి పడ్డారు. వారి స్కూల్ బ్యాగ్స్ అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ ఆటో నుజ్జునుజ్జు అయింది.

8 students were injured when a lorry rammed an auto in Visakhapatnam

దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ట్రాఫిక్ జంక్షన్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొందరు విద్యార్థులు కింద పడ్డ ఆటో కింద నలిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తోన్న వాహనదారులు ఆటో వద్దకు చేరుకోవడం ఈ వీడియోలో కనిపించింది. ఆ పిల్లలందరూ మధురవాడలోని భాష్యం స్కూల్ విద్యార్థులు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. వారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు వంద మీటర్ల దూరం వెళ్లిన తరువాత ఆగిపోయింది. డ్రైవర్, క్లీనర్ పారిపోవడానికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న కొందరు ఆటో డ్రైవర్లు, స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు పట్టిచ్చారు. స్కూల్‌కు వెళ్లాల్సిన తమ పిల్లలు రక్తమోడుతూ ఆసుపత్రుల్లో కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+