ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: లక్షా60వేలకు చేరువలో, విశాఖలో అత్యధికం, 67 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు మరింతగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా గత మూడు నాలుగు రోజులపాటు రోజుకు పదివేల కేసులు దాటగా.. ఆదివారం మాత్రం అంతకంటే కొంచెం తక్కువగానే కరోనా కేసులు నిర్ధారణయ్యాయి. పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కొత్త కరోనా పాజటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి.

Recommended Video

    COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu

    8వేలకుపైగా కొత్త కేసులు..

    8వేలకుపైగా కొత్త కేసులు..

    ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 8555 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 6272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 82,886 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    కొత్తగా 67 మరణాలు.. 20లక్షలకుపైగా టెస్టులు

    కొత్తగా 67 మరణాలు.. 20లక్షలకుపైగా టెస్టులు

    రాష్ట్రంలో గత 24 గంటల్లో 52,834 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,65,407 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 74,404 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో కరోనా బారినపడి 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1474కు చేరింది.

    కృష్ణాలో అత్యధిక మరణాలు..

    కృష్ణాలో అత్యధిక మరణాలు..

    కరోనా బారినపడి కృష్ణాల్లో 11 మంది, గుంటూరులో 8 మంది, తూర్పుగోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

    విశాఖపట్నంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు

    విశాఖపట్నంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు

    తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నం నుంచే ఉన్నాయి. జిల్లాలో వారీగా కేసులను పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 696, చిత్తూరులో 781, తూర్పుగోదావరిలో 930, గుంటూరులో 639, కడపలో 396, కృష్ణాలో379, కర్నూలులో 996, నెల్లూరులో 448, ప్రకాశంలో 384, శ్రీకాకుళంలో 492, విశాఖపట్నంలో 1227, విజయనగరంలో 637, పశ్చిమగోదావరిలో 550 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఏపీ కంటే ముందు మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+