ఏపీలో కొత్తగా 88 కరోనా కేసులు: జిల్లాలవారీగా, స్వల్పంగా పెరిగిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,680 నమూనాలను పరీక్షించగా.. 88 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వివరాలను వెల్లడించింది. తాజాగా నమోదైన 88 కరోనా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,298కు చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7167గా ఉంది.
ఇక ఒక్కరోజు వ్యవధిలో 72 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,81,511కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 620 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,37,28,728 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలు జిల్లాలవారీగా ఇలా ఉన్నాయి. అనంతపురంలో 3, చిత్తూరులో 23, తూర్పుగోదావరిలో 3, గుంటూరులో 8, కడపలో 7, కృష్ణాలో 19, నెల్లూరులో 7, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 8, విశాఖపట్నంలో 11 కేసులు నమోదైంది. ఇక కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Recommended Video
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 6.70 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,264 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజు వ్యవధిలో 90 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,56,302కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,45,634 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1.06 కోట్ల మందికిపై కోలుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,10,85,173 మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.












Click it and Unblock the Notifications