PM-SHRI: ఏపీలో విద్యార్ధులకు మోడీ గుడ్ న్యూస్..! న్యూఇయర్ గిఫ్ట్..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు ప్రధాని మోడీ కొత్త సంవత్సరం ప్రారంభవేళ గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా అరకొర వసతులతో ఉన్న స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్ధులకు ఈ కొత్త ఏడాదిలో సకల వసతులు కల్పించడమే కాకుండా జాతీయ విద్యావిధానం ప్రకారం నాణ్యమైన విద్య అందించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఓ కీలక పథకంలో వీరిని భాగస్వాములు చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన భేటీలో మోడీ ప్రకటన చేశారు.
ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ)గా అభివర్ణిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని పలు స్కూళ్లను తాజాగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఏపీలో ఏకంగా 935 స్కూళ్లను కేంద్రం ఎంపిక చేసింది. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఆయా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ఇతర విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నారు. దీంతో కొత్త ఏడాదిలో ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల పంట పండబోతోంది.

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే పీఎం శ్రీ పథకం ప్రధాన లక్ష్యమని ప్రధాని మోడీ ప్రకటించారు. రాష్ట్రాల సీఎస్ లతో జరిగిన భేటీలో పాల్గొన్న మన రాష్ట్ర సీఎస్ విజయానంద్ దీనిపై అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద 935 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా స్కూళ్లను మెరుగైన రీతిలో అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన, డిజిటల్ సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications