తల్లీకూతుళ్ల కిడ్నాప్: పడవ బోల్తా, దంపతుల మృతి
కృష్ణా: విజయవాడలో తల్లీకూతుర్లు అదృశ్యమయ్యారు. బెంజ్ సర్కిల్ వద్ద తల్లీకూతురును ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
నాటు పడవలో బోల్తా
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పాత ఓబనపాలెం వద్ద నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో
చినగంజాం మండలం కాటంవారిపల్లికి చెందిన దంపతులు మృతి చెందినట్లు తెలిసింది.
స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా నరవాడకు చెందిన ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించాడు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న అతడు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పేలుడు: ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లాలోని రాంబిల్లిలోని ఓ ఇంట్లో మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications