బీటెక్ విద్యార్థిని దారుణ హత్య: నడిరోడ్డుపై పొడిచి చంపిన దుండగుడు

అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రమ్య కాకాణి రహదారిపై వెళుతోంది. అటుగా వచ్చిన ఓ యువకుడు తన బైక్‌పై ఎక్కాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే, ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో రమ్యను విచక్షణా రహితంగా పొడిచి పారిపోయాడు.

రక్తపుమడుగులు పడివున్న యువతిని గమనించిన స్థానికులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తలించారు. రమ్య మెడ, పొట్ట భాగంలో తీవ్రగాయాలు కావడంతో అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు.

a Btech girl student murdered in Guntur district

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పాత గుంటూరు పోలీసులను ఎస్పీ ఆదేశించారు. బాధితురాలికి హంతకుడు తెలిసిన వ్యక్తేనా? లేక మరేదైనా కారణంతో ఈ దారుణానికి తెగబడ్డాడా? అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. రమ్య హత్య ఘటనపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చాలా బాధాకరమని

పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఓ వివాహిత క్షణికావేశంలో తన పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన బండారి శ్రావణ్ కుమార్‌కు మానస(30)తో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి షర్మిల(3), జ్యోతి(2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా, శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రించారు. అంతకుముందు భర్తతో గొడవపడిన మానస ఆవేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల గొంతులను చున్నీతో హత్య చేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆదివారం తెల్లవారుజామున భర్త తలుపులు కొట్టి చూడగా.. ఎంతకూ స్పందన రాలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోపకలికి వెళ్లాడు. అప్పటికే ముగ్గురూ కూడా విగత జీవులుగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానిిక చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రావణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పడవ బోల్తాపడి ముగ్గురు మత్స్యకారులు మృతి

సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో అందులోని ముగ్గురు మత్స్యకారులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో శనివారం చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. బందరువానిపేటకు చెందిన పుక్కళ్ల గన్నయ్య(54), ఆయన కుమారుడు గణేష్(23), రాయితి నారాయణస్వామి(58) సముద్రంపై చేపలవేటకు వెళ్లారు. కొంచెం దూరం వెళ్లగానే పడవ బోల్తాపడి ముగ్గురూ గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం బందరువానిపేటలో, మరో రెండు మృతదేహాలు పోలాకి తీర ప్రాంతంలో లభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+