దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్ తగిలింది. దువ్వాడ శ్రీనివాస్ గతంలో చేసిన కామెంట్స్‌పై తాజాగా కేసు నమోదైంది. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికుల ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్సీ దువ్వాడ దూషించి,అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.
గతంలో టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయించినా అప్పట్లో పోలిసులు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా జనసైనికులు ఆరోపించారు.విచారణ జరిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికే వ్యక్తిగతంగా దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని ,దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య , కూతుర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు.

ఈ క్రమంలో వారు టెక్కలిలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతుళ్లు, తండ్రితో కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం వ్యవహారం కోర్టులో నడుస్తోంది. తన వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందని, తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని అధినేత జగన్‌ను కోరానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పారని దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. మరీ తనపై నమోదైన కేసుపై దువ్వాడ శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications