వైసిపికి మ‌ద్దుత‌గా ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగిన ప్రముఖ యాంకర్..

ఏపీలో ఓ వైపు ఎండల‌ తీవ్ర‌త పెరిగిపోతుంటే, మ‌రోవైపు ఎన్నిక‌ల వేడి రోజురోజుకీ పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నిక‌ల ప్రచారంలో ఫుల్ బిజి బిజీ అయిపోయాయి. ఇక కొన్ని పార్టీల‌యితే సినీన‌టుల‌నీ కూడా త‌మ ప్రచారాలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ప్ర‌ముఖ యాంక‌ర్ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగింది. ఆమె ఎవ‌రో కాదు యాంక‌ర్ శ్యామ‌ల. శ్యామల గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. వైసిపికి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగింది శ్యామ‌ల‌. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగింది.

ఆదివారం నాడు ప్రచారంలో భాగంగా అక్కడి మీడియాతో యాంకర్ శ్యామల మాట్లాడారు. గ‌త ఎన్నిక‌ల్లో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరాను. ఈ పార్టీలో చేరాక మొదట ప్రచారం ఎల‌క్ష‌న్ క్యాంప‌యిన్ చేసింది శ్రీనివాసరావు గారికే. 2019 ఎన్నిక‌ల్లో మహిళలతో క‌లిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసాను. అప్ప‌డు అవంతి గారికి అవకాశం ఇచ్చారు. ప్ర‌జ‌లంతా ఓటు వేసేముందు ఒక్కసారి ఆలోచించాలి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేయాలా? లేక హామీలు ఇచ్చి వదిలేసే ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. నేడు వైఎస్సార్ కాలనీకి రావడం జరిగింది.

A famous anchor joined the election campaign in support of YCP

ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని వారి కుటుంబ స‌భ్యుల్లా చూస్తున్నారు. వైఎస్సార్ కాల‌నీలోని వైసీపీ కుటుంబం అంతా కలిసి ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌డానికి వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను శ్యామ‌ల షేర్ చేశారు. ఇవి కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి. యాంక‌ర్ శ్యామ‌ల పోస్ట్ చేసిన వీడియోలో ఇలా ఉంది. నేడు నేను ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నాను. విశాఖపట్టణం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం వై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు గారు అలాగే వారి కుమార్తె ఆరవ వార్డు కార్పొరేటర్ అయిన ప్రియాంక ముత్తంశెట్టితో కలిసి ఎన్నిక‌ల ప్ర్రచారంలో పాల్గొన్నాను అంటూ పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+