జగన్ కు ఓ చిన్నారి లేఖ: 'రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి..'

కైకలూరు: వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాల హామిలను జనాల్లోకి తీసుకెళ్తూ సాగిపోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో మంగళవారం చినపాలమర్రులో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి జగన్ కు ఓ లేఖ అందజేయడం విశేషం. రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలపై లేఖలో ఆ చిన్నారి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

చిన్నారి లేఖ:

స్వాగతం సుస్వాగతం జగనన్నకి.
మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది.
మా ఇల్లు పూరిల్లు. పూరిల్లుని డాబాలు చేయమని కోరుకుంటున్నాం. 2000 ఫించన్‌ వృద్దులకు ఇవ్వడం మంచిది.
రాష్ట్రంలో అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి.
ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడుతావని కోరుకుంటున్నాం.. అని ఆ చిన్నారి లేఖలో పేర్కొంది రాసింది.

సోషల్ మీడియాలో:

సోషల్ మీడియాలో:

ఆ చిన్నారి రాసిన లేఖను జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఇవాల్టి పాదయాత్రలో 5వ తరగతి చదువుతున్న ఓ చిట్టితల్లి తాను రాసిన ఈ చిట్టీని చేతికిచ్చింది.' అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

కాగా, నవరత్నాల్లో భాగంగా వైసీపీ 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీ తల్లికి ఏటా నేరుగా రూ.15000 అందిస్తారు. రాష్ట్రంలో ప్రతీ బిడ్డకు విద్య అందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. వారి చదువు పూర్తయ్యేంతవరకు మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని జగన్ చెబుతున్నారు.

నాయి బ్రాహ్మణులకు వరాలు:

నాయి బ్రాహ్మణులకు వరాలు:


నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తామని జగన్ హామి ఇచ్చారు. నాయి బ్రాహ్మణులు లేకపోతే నాగరికత ముందుకు సాగలేదన్నారు. చిన్నకులం కావడంతో వారు రాజకీయ వివక్షకు గురయ్యారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని జగన్ హామి ఇచ్చారు. అలాగే 500యూనిట్ల వరకు డొమెస్టిక్ టారిఫ్ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Recommended Video

    ప్రజా సంకల్ప యాత్ర లో జగన్ స్పీచ్
    అన్నివిధాల ఆదుకుంటాం:

    అన్నివిధాల ఆదుకుంటాం:


    ప్రస్తుతం క్షౌరశాలల్లో ఫ్యాన్‌లు, టూబ్‌లైట్లకు రూ. 8 నుంచి రూ. 14 వరకు కరెంట్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని, నెలకు కనీసం రూ.4వేల కరెంట్ బిల్లు కడుతుంటే ఇక బతకడమెలా అని వారు వాపోతున్నట్టు చెప్పారు. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌ బదులుగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణులకు అన్ని విధాల మేలు చేస్తామన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+