టీచర్ ఉద్యోగం రాలేదని ఉన్నత విద్యావంతురాలు ఆత్మహత్య

ప్రకాశం: మోడల్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించలేకపోయానని మనస్తాపం చెందిన ఓ ఉన్నత విద్యావంతురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం అంబవరంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. అంబవరం గ్రామానికి చెందిన మాధవి(23) ఎమ్మెస్సీ బీఈడీ వరకు చదివింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో అందుకోసమే తీవ్రంగా కృషి చేసింది. గతంలో రాసిన డీఎస్సీ రెండు మార్కుల తేడాతో ఉద్యోగం చేజార్చుకుంది.

కాగా, బుధవారం రాచర్లలో మోడల్ స్కూల్ టీచర్ల ఎంపిక నిమిత్తం జరిగిన ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ కూడా విజయం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

A girl allegedly committed suicide

ఆమెను గమనించిన చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ భర్తను కత్తితో పొడిచి కడతేర్చిన ఘటన విశాఖపట్నం జిల్లాలోని జీకేవీధి మండలం తంకాడకొత్తూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్రాపు అమ్మాజీ తన భర్తపై కోపంతో కత్తితో పొడిచి చంపేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+