బాలికతో భర్త కలిసుండటం చూసిన భార్య: ఉరేసి చంపారు

Subscribe to Oneindia Telugu

తూర్పుగోదావరి: జిల్లాలోని రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో గత జూన్‌ 7న జరిగిన మైనర్‌ బాలిక పప్పుల ఆదిలక్ష్మి హత్యకేసులో నిందితులు రాధాకష్ణ, అన్నపూర్ణ, త్రిమూర్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు మంగళవారం రాత్రి రామచంద్రపురం సీఐ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ కాశీవిశ్వనాథంలతో కలిసి మీడియాకు తెలిపారు.

ఈ కేసు విచారణలో ఆ బాలికను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. హత్య కేసు, బాలికార్మికురాలితో పనిచేయించుకున్న నేరం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఎనిమిదేళ్ల క్రితమే అప్పటికి ఎనిమిదేళ్ల వయసున్న బాలికను, రాధాకృష్ణ ఇంట్లో పనికి పెట్టుకున్నారని తెలిపారు.

చదివిస్తానని, కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ బాలిక తల్లిదండ్రులను నమ్మించాడన్నారు. బాలికను 7వ తరగతి వరకు చదివించిన రాధాకృష్ణ, ఆ తర్వాత ఆమెను పాఠశాలకు పంపలేదు. అంతేగాక, గత కొంతకాలంగా రాధాకృష్ణ ఆ బాలికను శారీరకంగా అనుభవిస్తున్నాడన్నారు. ఈ నేపథ్యంలో జూన్‌7న తన భార్య ఆరోగ్యం బాగులేక మందు వేసుకుని నిద్రిస్తుండగా, మరో గదిలో బాలికతో గడిపాడన్నారు.

A girl allegedly killed in Ramachandrapuram

భార్య నిద్ర లేచి వీరిద్దరినీ చూసి ఘర్షణకు దిగిందని డీఎస్పీ చెప్పారు. ఈ ఘర్షణలో బాలికకు, ఆయన భార్యకు వాగ్వాదం చోటుచేసుకుందన్నారు. దీంతో ఆ బాలికను రాధాకృష్ణ కొట్టాడని, అసలు విషయం బయటపడుతుందని తన అనుచరుడైన అర్జునరావు సహకారంతో బాలికను హత్య చేశారని డీఎస్పీ వివరించారు.

రాత్రి పూట ఆ బాలిక నివసించే పాకలో చేతికందేంత ఎత్తులోనే చున్నీతో ఉరివేసుకున్నట్లు చిత్రీకించారన్నారు. విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో రాధాకృష్ణ, ఆయన భార్య అన్నపూర్ణను ఏరియా ఆస్పత్రి వద్ద అరెస్టు చేయగా, పంపన త్రిమూర్తులు వీఆర్వో ఎదుట లొంగిపోయాడన్నారు.

త్రిమూర్తులుకు సంబంధించిన అప్పులు చెల్లిస్తానని రాధాకృష్ణ నమ్మించి ఈ హత్యకు వాడుకున్నాడన్నారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl allegedly killed in Ramachandrapuram in East Godavari district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X