ఇంటర్ విద్యార్థినికి మత్తు మందిచ్చి.. నగ్న ఫొటోలు తీశారు, సోషల్ మీడియాలో పోస్ట్, ఆ తర్వాత
ప్రకాశం: జిల్లాలోని పెద్దదోర్నాల దారుణ ఘటన చోటు చేసుకుంది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను విద్యార్థిని చేత తాగించి ఆమె నగ్నచిత్రాలను మొబైల్ ఫోన్లు తీశాడో దుర్మార్గుడు. వాటిని మరో యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులిద్దర్నీ అరెస్ట్ చేశారు పోలీసులు.

కూల్ డ్రింక్‌లో మత్తు కలిపి తాగించాడు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి(19) డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలకు ఇటీవల మార్కాపురం వచ్చింది. పరిచయం, ఉండటంతో మీరావలి పలకరించాడు. కూల్ డ్రింక్ తాగుదామంటూ పిలిచాడు.
కూల్ డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ తప్పిపోయింది.

యువతి నగ్న ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
ఆ తర్వాత విద్యార్థినిని వివస్త్రను చేసి మొబైల్ ఫోన్లో పొటోలు తీశాడు. ఆ ఫొటోలను చూసిన మీరావలి స్నేహితుడు, మెకానిక్ రసూల్(22) వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగూర్ మీరావలి, రసూల్‌ను అరెస్ట్ చేశారు.

ఆడుకునేందుకు వచ్చిన బాలికపై దారుణం
ఇది ఇలావుండగా, ఆడుకుందామని వచ్చిన చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు చెక్కిడాల రాజా.. తమ కుటుంబంలో ఉన్న బాలుడితో ఆడుకునేందుకు వచ్చిన ఐదేళ్ల బాలికను తన ఇంటిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పూర్తిగా విచారించగా ఇతడు ఓ వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలిసింది. ఘటనకు సంబంధించి చిన్నారి మాటలు, అక్కడ ఉదయం జరిగిన సంఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications