Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్షిణిని బలి ఇవ్వబోతున్న అఘోరీ? ఆ పూజ కోసమేనా ? సంచలన నిజాలు వెలుగులోకి

తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌ లోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణి పెళ్లి చేసుకున్న వీడియో బయట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోలో వర్షిణి మెడలో అఘోరి తాళికట్టగా.. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత తలంబ్రాలు పోసుకోవడం, ఏడడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

పెళ్లి తర్వాత తనకు సంసారం సుఖం అక్కరలేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని.. అవసరమైతే ఒక అనాథ బిడ్డను పెంచుకుంటానని వర్షిణి గతంలోనే వెల్లడించింది. అయితే అఘోరీ-శ్రీవర్షిణి పెళ్లి వ్యవహారం మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షిణిని అఘోరీ బలి ఇవ్వబోతున్నాడా? అని కొందరి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అఘోరీ వర్షిణిను ఏం చేస్తాడో అన్నదానిపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

కన్న తల్లిదండ్రులను అన్నను వదిలి అఘోరీని పెళ్లి చేసుకున్న వర్షిణికి పిచ్చి లేసిందని కొందరు అంటున్నారు. అంతేకాకుండా వర్షిణిని అఘోరీ బలి ఇవ్వబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు నెటిజెన్లు. అఘోరీకి నిజంగా శక్తులున్నాయా? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే.. అఘోరీ ఫేకా, రియలా అంటూ చర్చించుకుంటున్నారు. ఇలా వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా. నేనే అఘోరీ మొదటి భార్యను అంటూ రాధ అనే మహిళ మీడియా ముందు ప్రత్యక్షమైంది. అతడి పేరు అల్లూరి శ్రీనివాస్ అని వెల్లడించింది. అతడు మోసగాడని.. తనను మోసం చేశాడని పేర్కొంది. మొదట తన మెడలో తాళి కట్టి.. ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఈ మేరకు డిమాండ్ చేసింది.

A key development has taken place in the Aghori and Varshini affair

మరోవైపు అఘోరీకు సంబంధించి మరో సంచలన మోసం బయటపడింది. యోని పూజ చేస్తానని.. రూ. 10 లక్షలు తీసుకుని అఘోరీ తనను మోసం చేసినట్లు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. లేడీ అఘోరీతో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడిందని.. ఆమె మాటలు నమ్మి యోని పూజకు అంగీకరించానని వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు లేడీ అఘోరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీళ్లిద్దరినీ వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+