అప్పు: కత్తులతో దాడి చేసి పాతబస్తీలో వ్యాపారి దారుణహత్య
హైదరాబాద్: వ్యాపారా లావాదేవీల నేపథ్యంలో పాతబస్తీలోని ఓ వ్యాపారిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రెయిన్‌బజార్‌కు చెందిన హుస్సేన్ చెత్తాబజార్‌లో షాహీన్ ప్రింటర్స్, బైండింగ్ వర్క్స్ షాపు నిర్వహిస్తున్నాడు.
ఇతని వద్ద పనిచేస్తున్న జావెద్ అనే వ్యక్తి హుస్సేన్ వద్ద రూ. 2లక్షల తీసుకుని అక్కడి నుంచి సమీపంలో మోయిన్ ప్రింటర్స్ అనే షాపును వేరుగా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య కక్షలు పెరిగాయి. ఈ క్రమంలో హుస్సేన్ నుంచి తీసుకున్న రూ. 2లక్షలను చెల్లించటంలో జావెద్ జాప్యం చేశాడు. దీంతో తన డబ్బులు తనకు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చెల్లించాలంటూ కొద్దిరోజుల క్రితం హుస్సేన్ నిలదీయటంతో జావెద్ రూ. 50వేలు చెల్లించాడు.

ఆ తర్వాత మిగిలిన డబ్బు కోసం తమ వద్ద చీటి రాయించుకోవాలని హుస్సేన్ కోరటంతో జావెద్ చీటీ కూడా రాయించుకుని ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాడు. కాగా, ఐదు నెలల నుంచి జావెద్ కన్పించకుండా అదృశ్యమయ్యాడు. అప్పు విషయంపై పలువురు బెదిరించడంతో అతను అదశ్యమయ్యాడని అంటున్నారు.
ఈ క్రమంలో అతనిపై కక్ష పెంచుకున్న హుస్సేన్, అతని ఇద్దరు స్నేహితులను తీసుకుని కత్తులతో బుధవారం ఉదయం జావెద్‌పై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు.
రక్తపు మడుగులో పడిపోయిన జావెద్‌ను పలువురు స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను సాయంత్రం 6గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విషయం తెల్సుకుని రంగంలో దిగిన పోలీసులు హుస్సేన్, అతని ఇద్దరు స్నేహితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications