విద్యార్థినిపై వాచ్‌మెన్ అత్యాచారం: పొరుగింటి మహిళపై..

A man allegedly raped minor girl
హైదరాబాద్/ముజఫర్‌నగర్: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. తార్నాకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలికపై పాఠశాల వాచ్‌మెన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడ్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.

పొరుగింటి మహిళపై అత్యాచారం

ముజఫర్‌నగర్: పొరుగింటి మహిళపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తికి ముజఫర్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అఖిలేష్ అనే వ్యక్తి తమ పక్క ఇంట్లో ఉండే మహిళపై అత్యాచారం చేశాడు. అత్యాచారం నేరం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా సిసోలిలో 2011, అక్టోబర్ 8వ తేదీన బాధితురాలిపై ఆమె ఇంట్లోనే అఖిలేష్ అత్యాచారం చేసినట్లు ప్రాసిక్యూషన్ వాదించడంతోపాటు నిరూపించింది. కోర్టులో అతడు నేరం చేసినట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి హరీష్ త్రిపాఠి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. రూ. 30వేల జరిమానా విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+