తాడేపల్లిలో దారుణం: చెల్లెలంటూ అసభ్యంగా, గంజాయి మత్తులో యువతిని నరికి చంపాడు
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన ఓ యువతిని గంజాయి మత్తులో ఉన్న ఓ దుండగుడు నరికి చంపాడు.
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన ఓ యువతిని గంజాయి మత్తులో ఉన్న ఓ దుండగుడు నరికి చంపాడు. ఈ దారుణ ఘటన ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతితో అసభ్య ప్రవర్తన
ఇంట్లో ఎవరూ లేని సమయంలో కంటి చూపులేని బాధితురాలు ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతితో నిందితుడు రాజు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో రాణి తల్లి నిందితుడిని నిలదీసింది. అయితే, తనకేమీ తెలియదని, రాణి తన చెల్లెలిలాంటిందని నమ్మకబలికే ప్రయత్నం చేశాడు నిందితుడు రాజు.

గంజాయి మత్తులో యువతిని నరికి చంపాడు
ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం గంజాయి మత్తులో రాణిని అతి దారుణంగా కత్తితో నరికాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాధితురాలు తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు.

డీఎస్పీ ఎదుట లొంగిపోయిన నిందితుడు రాజు?
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తన కూతురిని హత్య చేసిన నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరింది.
కాగా, కొంతమంది పోలీసులతో ఉన్న స్నేహం వల్లే రాజు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ హెడ్ కానిస్టేబుల్ పైనా రాజు దాడి చేశాడనే ఆరోపణలున్నాయి. అంతేగాక, ఓ వివాహితపైనా గొడ్డలితో దాడి చేశాడని చెబుతున్నారు. నేరాలకు పాల్పడుతున్న రాజును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చశారు. అలాగే, గంజాయి, మత్తుపదార్థాల సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు. కాగా, నిందితుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications