విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టపగలే బ్యాంకులో దోపిడీ: తుపాకీతో బెదిరించి బ్యాగులో లక్షలు వేసుకుని వెళ్లాడు(వీడియో)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పట్టపగలు బ్యాంకులో జరిగిన దోపిీ అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది.
అనకాపల్లి పట్టణంలోని కశింకోట మండలం నర్సింగపల్లిలోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో అందరూ చూస్తుండగానే చోరీకి పాల్పడ్డాడు దుండగుడు. తనను ఎవ్వరు గుర్తు పట్టకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుని బ్యాంకులోకి ప్రవేశించాడు. తుపాకీతో సిబ్బందిని బెదిరించి రూ.3లక్షలకుపైగా నగదు దోచుకుపోయాడు. పట్టపగలు బ్యాంక్ సిబ్బందిని తుపాకీతో బెదిరించి ఈ మొత్తం నగదు ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

బ్యాంకులోకి హెల్మెట్ వచ్చి.. తుపాకీ చూపించి, రూ. 3 లక్షలు దోచేశాడు

బ్యాంకులోకి హెల్మెట్ వచ్చి.. తుపాకీ చూపించి, రూ. 3 లక్షలు దోచేశాడు

వివరాల్లోకి వెళితే.. ఆ దుండగుడు ముఖం సరిగా కనిపించకుండా హెల్మెట్ ధరించి బ్యాంకులోకి ఏదో పని ఉన్న వ్యక్తిలా ప్రవేశించాడు. నేరుగా క్యాష్ లెక్కపెడుతున్న క్యాషియర్ ప్రతాప్ రెడ్డి కౌంటర్ వద్దకు వెళ్లి తుపాకీతో బెదిరించాడు. మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి తన బ్యాగులోపెట్టాలంటూ తుపాకీతో భయపెట్టాడు. దీంతో చేసేదేలేం లేక.. క్యాషియర్ ప్రతాప రెడ్డి మొత్తం రూ.3,31,320లను సదరు దుండగుడికి అప్పగించేశాడు. ఆ తరువాత సదరు దుండగుడు నువ్వు సేఫ్ అంటూ హిందీలో మాట్లాడి అక్కడ్నుంచి ఏమి ఎరుగనట్లుగా జారుకున్నాడు.

దోపిడీకి బ్యాంక్ సిబ్బంది సహకరించారా?

దోపిడీకి బ్యాంక్ సిబ్బంది సహకరించారా?

అయితే, సరిగ్గా క్యాషియర్ క్యాష్ లెక్క పెట్టే సమయంలోనే దుండగుడు రావటం క్యాష్ ఇవ్వమని తుపాకీతో బెదిరించటం.. క్యాషియర్ ఏమాత్రం ప్రతిఘటించకుండా ఇచ్చేయటంతో పోలీసులు బ్యాంకు సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. తుపాకి చూపించడంతో భయపడి కూడా నగదు ఇచ్చే అవకాశం లేకపోలేదు

సీసీటీవీలో రికార్డైన దోపిడీ దృశ్యాలు

అయితే, ఈ ఘటనపై పోలీసులు.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి అదే ప్రాంతానికి చెందినవాడా? ముందుగానే రెక్కీ నిర్వహించి దోపిడీకి వచ్చాడా? అతని చేతిలో ఉన్నది నిజమైన తుపాకీయేనా? ఈ దోపిడీలో సిబ్బంది సహకారం ఉందా?అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దుండుగుడు హిందీలో మాట్లాడటంపైనా విచారణ జరుపుతున్నారు. అయితే, దోపిడీకి సంబంధించిన మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డు కావడం గమనార్హం. దీంతో ఆ ఫుటేజీని ఉపయోగించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A man, threatening with gun, looted cash in anakapalle bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X