Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

sai priya: భర్తతో వచ్చి ఆర్కే బీచ్‌లో మాయం, ప్రియుడితో పెళ్లి, బెంగళూరులో!

అమరావతి: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన చిరిగిడి సాయిప్రియ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సముంద్రంలో గల్లంతైందన్న సాయిప్రియ భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నావికాదళం, ఈతగాళ్లు రెండు రోజులపాటు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. అయితే, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం సాయంత్రం తాను బెంగళూరులో ప్రియుడితో ఉన్నానంటూ సాయిప్రియ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో అదృశ్యం వ్యవహారానికి పుల్‌స్టాప్ పడింది.

ప్రియుడితోనే ఉన్నానంటూ తండ్రికి సాయిప్రియ

ప్రియుడితోనే ఉన్నానంటూ తండ్రికి సాయిప్రియ

తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సాయిప్రియ పలు సంచలన విషయాలు వెల్లడించింది. 'నాన్నా నేను సాయిని మాట్లాడుతున్నాను. చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. రవి(సాయిప్రియ ప్రేమించిన యువకుడు) దగ్గర ఉన్నాను. అతనితో నాకు పెళ్లి కూడా అయ్యింది. అతనేమీ బలవంతంగా తీసుకురాలేదు. దయచేసి మా గురించి వెతకొద్దు. ప్లీజ్ నాన్నా.. నీకు పుణ్యం ఉంటుంది. ఇక నాకు పరుగెత్తే ఓపికలేదు' అంటూ సాయిప్రియ తల్లిదండ్రులతో మాట్లాడింది.

సారీ.. ఇక చావైనా, బతుకైనా రవితోనేనంటూ సాయిప్రియ

సారీ.. ఇక చావైనా, బతుకైనా రవితోనేనంటూ సాయిప్రియ

అంతేగాక, 'ఇక చావైనా, బతుకైనా రవితోనే. నాకు బతకాలని ఉంది. చావాలన్న ఉద్దేశం లేదు. నా గురించి వెతికితే చచ్చిపోతా. ఇద్దరం కలిసే చచ్చిపోతాం. నా గురించి వెతికిన అధికారులను క్షమించమని వేడుకుంటున్నా. మేము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఒకర్ని వదిలి మరొకరం ఉండలేం. ఆంటీ(రవి తల్లి) వాళ్లకు ఏమీ సంబంధం లేదు. వారిని ఏమి చేయొద్దు. ప్లీజ్ నాన్నా' అంటూ తన తండ్రికి వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టింది సాయిప్రియ. తాలిబొట్టుతో ఉన్న ఫొటోలను కూడా పంపించింది.

భర్తతో వచ్చి ఆర్కే బీచ్‌లో మాయమైన సాయిప్రియ

భర్తతో వచ్చి ఆర్కే బీచ్‌లో మాయమైన సాయిప్రియ

అంతకుముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. విశాఖపట్నం ఆర్కే బీచ్​లో సోమవారం రోజున తన భార్య సాయిప్రియ(21) గల్లంతైనట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి రోజున సరదాగా గడుపుదామని బీచ్‌కు వచ్చామని చెప్పాడు. తాను ఫోన్ చూసుకుంటున్న సమయంలో తన భార్య సముద్రం వద్దకు వెళ్లిందని.. అలలతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపుర, సాయిప్రియ ఆచూకీ కోసం కోస్టు గార్డుకు చెందిన హెలికాప్టర్​, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు నెల్లూరుతో ఓ యువకుడితో సాయిప్రియ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు బెంగళూరులో ఉన్నామంటూ తల్లిదండ్రులకు తెలియజేసింది సాయిప్రియ. దీంతో సాయిప్రియ తన భర్త నుంచి ఉద్దేశపూర్వకంగానే వెళ్లిపోయిందని తేలిపోయింది. మొదట అంతా భర్తపైనే అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. చివరకు సాయిప్రియ ప్రేమ వ్యవహారం బయటపడటం మిస్సింగ్ కథ పలు మలుపులు తిరిగినట్లయింది.

సాయిప్రియ గాలింపు కోసం రూ. కోటి ఖర్చు

సాయిప్రియ గాలింపు కోసం రూ. కోటి ఖర్చు

ఇది ఇలావుండగా, సాయిప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేసినట్లు సమాచారం. హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టడంతోనే ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయన్నారు. కాగా, సాయిప్రియ ఆచూకీ కోసం పోలీసులు, ఈతగాళ్లతోపాటు నేవీ బలగాలు హెలికాప్టర్ సాయంతో రెండు రోజులపాటు తీవ్రంగా గాలించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+