మంత్రి హరీశ్ ఎదుట ఎంపిటిసి ఆత్మహత్యాయత్నం
మెదక్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఓ ఎంపిటిసి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మంగళవారం గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతుండగా చోటు చేసుకుంది.
ఇటిక్యాల గ్రామానికి చెందిన ఎంపిటిసి భాస్కర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

అయితే ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ కుటుంబం గ్రామ బహిష్కరణకు తానే కారణమంటూ పోలీసులు వేధిస్తున్నారని ఎంపిటిసి ఆరోపించారు. భాస్కర్‌ను పార్టీ కార్యకర్తలు సభ బయటకు తీసుకురావడంతో పరిస్థితి సద్దుమణిగింది.
జిల్లా కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. పంట రుణాలు, విద్యుత్ సరఫరా, దళితులకు భూపంపిణీ, రేషన్ కార్డులు, పింఛన్లు, చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, పరిశ్రమలకు భూముల కేటాయింపు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.












Click it and Unblock the Notifications