నిషిత్ మరణానికి కారణమదేనా? సేఫ్టీ మేజర్స్ కూడ కాపాడలేదా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ , అతని స్నేహితుడు రాజారవిచంద్ర మరణానికి అతివేగమే ప్రధాన కారణమని ఓ జాతీయమీడియా ఛానల్ కు చెందిన వెబ్ సైట్ ప్రచురించింది.

వారం రోజుల క్రితం నిషిత్ హైద్రాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదంలో నిషిత్ తో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్రకూడ మరణించాడు

అయితే అత్యంత అత్యాధునికమైన సౌకర్యాలు, టెక్నాలజీతో రూపొందించిన కారు ప్రమాదంపై పలువురు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే అదే సమయంలో ఈ ప్రమాదానికి గల అవకాశాలు ఏమిటనే విషయమై పోలీసులు కూడ ఆరాతీస్తున్నారు.

కారులో ఉన్న సదుపాయాలు ఏమిటి, ఏ రకంగా కారులోని సౌకర్యాలు కారులో ఉన్నవారి ప్రాణాలను రక్షించేందుకు పనికొస్తాయనే విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.ఈ మేరకు ఈ కార్ల తయారీ కంపెనీకి తమ అనుమానాలపై పలు ప్రశ్నలను సంధిస్తూ లేఖ రాశారు.

అతివేగమే నిషిత్ ప్రాణాలను తీసిందా?

అతివేగమే నిషిత్ ప్రాణాలను తీసిందా?

అతివేగమే మంత్రి నారాయణ కొడుకు ప్రాణాలను తీసిందా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో నిషిత్ ప్రయాణీస్తున్న కారు సుమారు 200 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తోంది.ఈ మేరకు స్పీడో మీటర్ ఆధారంగా గుర్తించారు. అయితే ఈ ఎస్ యూ వీ కార్లు 64 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నట్టు ఓ జాతీయమీడియా చానల్ కు చెందిన వెబ్ సైట్ కథనాన్ని ప్రకటించింది.

5 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్ తో

5 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్ తో

మంత్రి నారాయణ కొడుకు నిషిత్ ప్రయాణించిన కారు మెర్సెడ్స్ జీ 63 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్. ఈ వాహానం 5.4 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళనుంది.ఈ వాహానం టాప్ స్పీడ్ గంటకు 210 కిలోమీటర్లు. మరో పక్క ఎంత వేగంతో వెళితే ప్రమాదాలు జరుగుతాయోనని గతంలో మోస్ట్ ఇండస్ట్రీ స్టాండర్ట్ టెస్ట్ చేసిన పరిశోధనలు తెలిపాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది.

కారులో అనేక సదుపాయాలు

కారులో అనేక సదుపాయాలు

నిషిత్ ఉపయోగించిన మెర్సెడ్స్ జీ 63 స్పోర్ట్స్ యుటిలిటీ కారు. ఈ వాహనంలో ప్రమాదం జరగకుండా అనేక అత్యాధునిక సదుపాయాలున్నాయి. మరో వైపు ప్రమాదం జరిగినా బయటపడేందుకు కూడ అనేక సౌకర్యాలున్నాయి. కానీ, ఇవేవీ నిషిత్ ను కాపాడలేకపోయాయి. డ్యూయల్ ఫ్రంట్, సైడ్ అండ్ విండో ఎయిర్ బ్యాగ్స్, పెల్విస్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఈఎస్ పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం) , అడాప్టివ్ బ్రేకింగ్ తో ఈ కారును తయారు చేశారు.కానీ, వీటిల్లో ఏ ఒక్కటి కూడ నిషిత్ ను రవిచంద్రను కూడ ప్రమాదం నుండి కాపాడలేకపోయింది.

పాసెస్ట్ క్రాష్ టెస్ట్

పాసెస్ట్ క్రాష్ టెస్ట్

ఫాస్టెస్ట్ క్రాష్ టెస్ట్ ఇన్ ది వరల్డ్ పేరుతో బ్రిటీష్ మోటారింగ్ టెలివిజన్ షో ఓ వీడియోను ప్రసారం చేసింది. ఫోర్ట్ ఫోకస్ ఫ్యామిలీ కారు గంటకు 193 కి.మీట వేగంతో వెళ్ళి ప్రమాదానికి గురైంది. నిషిత్ కారు ప్రమాదానికి గురైన తీరును గమనిస్తే స్పీడో మీటర్ ముల్లు 200 కి.మీ. పైగా చూపిస్తోంది. సీసీ టీవి దృశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే మెర్సిడెజ్ జీ 63 కారు ఫోర్ట్ ఫోకస్ ఫ్యామిలీ కారు కంటే ధృడమైంది. అయితే ఈ రెండింటికి పోలిక లేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A national media website reveled on Andhrapradesh minister Narayan son Nisith's death.Overspeed is the reason for NIsith's death said website.police officers investigating on this incident.
Please Wait while comments are loading...