weekend marriage: దేశంలో కొత్త ట్రెండ్... ''వీకెండ్ మ్యారేజ్''!

కాలంతోపాటు యువతరం ఆలోచనలు కూడా మారుతున్నాయి.

కాలానికి అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. అది ప్రకృతి సహజం. మనకు సాధ్యమైనంతవరకు ఆ మార్పులకు అలవాటుపడుతూ జీవనం కొనసాగించడం ఒక పద్ధతి కాగా, వాటికి అలవాటుపడలేక పాతపద్ధతిలోనే సర్దుకుపోయేవారు మరికొందరున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంలా మారిపోయింది. దేశాల మధ్య హద్దులే చెరిగిపోతున్నాయి. ఇటువంటి తరుణంలోనే మనదేశంలోకి కొత్త ట్రెండ్ అడుగు పెట్టింది. దాని పేరు 'వీకెండ్ మ్యారేజ్'.

మారుతున్న యువతరం ఆలోచనలు

మారుతున్న యువతరం ఆలోచనలు


కాలంతోపాటు యువతరం ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను బ్రేక్ చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, లివింగ్ రిలేషన్ లాంటి కొత్త కల్చర్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'వీకెండ్ మ్యారేజ్' నే కాన్సెప్ట్ యువతను భాగా ఆకర్షిస్తోంది. పాత తరం సిద్ధాంతాలకు, పాతతరం విలువలకు గండికొడుతూ ఈ తరం కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతోంది.

జపాన్ నుంచి ఇండియాకి

జపాన్ నుంచి ఇండియాకి


ఒకప్పుడు జపాన్ లో 'వీకెండ్ మ్యారేజ్' అనే పదం వినిపించేంది. ఇప్పుడు మనదేశంలోను వినిపిస్తోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీతోపాటు బెంగళూరు, పుణె, ముంబయిలో ఈ సంస్కృతి ఎక్కువగా కనపడుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, త్వరలో పెళ్లి చేసుకోబోయే జంటలు, వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించే భార్యాభర్తలైన ఉద్యోగులు ఈ 'వీకెండ్ మ్యారేజ్' కు ఆకర్షితులవుతున్నారు. వారాంతపు వివాహం అంటే.. ఒక జంట వీకెండ్స్ లో ఏదైనా అపార్ట్ మెంట్స్ లో భార్యాభర్తలుగా కలిసి జీవించడం. అయితే దీనివెనక అనేక కారణాలున్నాయి. ఒకరు లేదా ఇద్దరు భాగస్వాములు వేర్వేరు నగరాల్లో ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు వీరంతా వీకెండ్ మ్యారేజ్ ను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే అత్యంత సవాళ్లతో కూడుకున్న ఈ జీవిన విధానంలో యువత మాత్రమే కాకుండా కొత్తగా పెళ్లిచేసుకోబోయే జంటలు కూడా 'వీకెండ్ మ్యారేజ్' పేరుతో ట్రయల్స్ వేస్తున్నాయి.

సవాళ్లతో కూడిన జీవన విధానం

సవాళ్లతో కూడిన జీవన విధానం


ఈ జీవన విధానం ఖచ్చితంగా సవాళ్లతో కూడుకున్నది. కేవలం యూత్ మాత్రమే కాకుండా పెళ్లి చేసుకోబోయే జంటలు కూడా 'వీకెండ్స్ మ్యారేజ్' పేరుతో ట్రయల్స్ వేస్తున్నాయి. భార్యాభర్తలు చిన్న విషయాలకే గొడవలు పడటం సహజంగా జరుగుతుండేది. ఈ 'వీకెండ్ మ్యారేజ్' వల్ల వారాంతంలో మీరు గడిపే సమయం తక్కువగా ఉండటంతో వాదనలు, విభేదాలను మరిపిస్తుంది. వారాంతాల్లో ఒకరినొకరు చూసుకున్నప్పుడు, కలిసి గడిపిన సమయాన్ని మరింత సానుకూలంగా గుర్తుండిపోయేలా చేస్తుంది. 'వీకెండ్ మ్యారేజ్' వల్ల లాభాలు ఎన్నివున్నాయో నష్టాలు కూడా అన్నేవున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+