తెలంగాణ రాజముద్రలో లోపాలు: హైకోర్టులో వ్యాజ్యం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో లోపాలున్నాయంటూ శుక్రవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ నగరానికి చెందిన టి. ధనగోపాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజముద్ర రూపకల్పన నిబంధనలు సరిగా పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో మూడు సింహాల కింద దేవనాగరి లిపిలో ఉండాల్సిన ‘సత్యమేవ జయతే' పదాలను వాటికి దూరంగా ఉందని, ఇది ‘స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా' చట్టానికి విరుద్ధమని అన్నారు.
లోపాలతో ఉన్న రాజముద్రకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీన్ని సరిదిద్దేలా ఆదేశిలివ్వాలని కోరారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రాజముద్ర రూపకర్త ఏలె లక్ష్మణ్‌నూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications