కుప్పంలో కేటుగాడు, వీఆర్వోలు టార్గెట్, రాజకీయ అండతో ఏం చేశాడంటే, కలెక్టరేట్ లో !
కుప్పం/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన ప్రాంతం కుప్పం అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుప్పం పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ కథ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సంబంధించినది వార్త కాదు.
కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ కేటుగాడి స్టోరీ బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో కుప్పం మండలానికి చెందిన ఓ వీఆర్వో రెచ్చిపోతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన వీర్వోలకు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు కల్పిస్తామని, ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు ఇవ్వగా సదరు వీఆర్వో చక్రం తిప్పి ప్రమోషన్లు ఇప్పిస్తామని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడని వెలుగు చూసింది.

కుప్పం మండలానికి చెందిన ఆ వీర్వో రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటే కచ్చితంగా రూ. 30 వేలకు పైగా లంచం వసూలు చేస్తున్నాడని, పదోన్నతుల కోసం ప్రయత్నిస్తున్న వీఆర్వోల నుంచి రూ. 50 వేల నుంచి సుమారు రూ. 1 లక్షకుపైగా డబ్బులు వసూలు చేస్తున్నాడని వెలుగు చూడటంతో సంబంధిత ఉన్నతాదికారులు హడలిపోయారని తెలిసింది.
ఆఫీసు అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వాలంటే కచ్చితంగా డిగ్రీ విద్యార్హత తప్పనిసరి కావడంతో కొందరు దొంగ సర్టిఫికెట్లపై అధికారులకు సమర్పించారని వెలుగు చూసింది. చిత్తూరు నగరానికి చెందిన ఓ వీఆర్వో వేరే రాష్ట్రంలో తాను డిగ్రీ చదివానని సర్టిఫికెట్ సమర్పించడం ఇప్పుడు కలకలం రేపింది.
రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగం సంఘం నాయకుడు పదోన్నతులు కావాలని ఆశపడుతున్న ఉద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడని వెలుగు చూడటం ఇప్పుడు కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పదోన్నతులు కోసం ఆశపడుతున్న వారు నకిలి ధ్రువపత్రాలు సమర్పించాని అధికారుల విచారణలో వెలుగు చూడటంతో అధికారులు హడలిపోతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 25 మంది వీఆర్వోలకు పదోన్నతులు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మొత్తం 197 మంది వీఆర్వోలతో ఓ జాబితా తయారు చేసిన అధికారులు అందులో కొంత మందికి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించారని తెలిసింది. ఈ విషయం పసిగట్టిన ఓ ఉద్యోగ సంఘం నాయుకుడు ప్రమోషన్లు కావాలని ఆశపడుతున్న వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిసింది.
అందులో చిత్తూరు జిల్లా కలేక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్న ఓ అధికారికి, రెవెన్యూ శాఖలోని ఓ అధికారికి వాటాలు ఇస్తున్నాడని వెలుగు చూసింది. అయితే పదోన్నతులు కావానే కొందరు ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో డిగ్రీ చదివామని కొన్ని సర్టిఫికెట్లు సమర్పించారని ఓ అధికారి అంటున్నారు.
పదోన్నతులు కావాలని అనుకుంటున్న 186 మంది మంది డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించారని, వారి సర్టిఫికెట్లు ఒరిజినల్ అవునా, కాదా అని తేల్చుకోవడానికి తాము యూనిర్శిటి అధికారులకు లేఖ రాశామని, అందులో 105 మంది డిగ్రీ చదివారని అధికారులు తిరిగి మాకు లేఖ రాశారని, మిగిలిన 81 మంది వివరాలు ఇంత వరకు అందలేదని సంబంధిత అధికారులు అంటున్నారు.
అయితే 81 మంది డిగ్రీలు చదవలేదని వెలుగు చూస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని చిత్తూరు జిల్లా జేసీ శ్రీనివాసులు అంటున్నారు. అయితే పదోన్నతులు ఇప్పిస్తామని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ఆ ఉద్యోగ సంఘం నాయకుడు ఎవరు ? అనే పేరు మాత్రం బయకు రాకపోయినా ఇప్పుడు కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలో ఆ లీడర్ గురించి వీర్వోల్లో జోరుగా చర్చ జరుగుతోందని తెలిసింది.












Click it and Unblock the Notifications