మహిళా ఉద్యోగితో ప్రిన్సిపల్ రాసలీలలు.. విద్యార్థులు ఏం చేశారంటే..
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రిన్సిపల్ పెడదారి పట్టాడు. మహిళా ఉద్యోగితో కలిసి రాసలీలలు కొనసాగిస్తున్నాడు. సదరు మహిళతో సహాస్య కార్యకాలాపాల్లో ఉండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఆనంద్ కుమార్
ఏపీలోని కృష్ణాజిల్లా మచీలిపట్నంలోని ఏపీ మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ బి.ఆనంద్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్‌తో రాసలీలలు సాగిస్తున్న వీడియోను విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో ఆ వీడియో తీసిన విద్యార్థులను చితకబాదాడు. ఈ విషయం కూడా వైరల్ కావడంతో అధికారులు సీరియస్ చర్యలు తీసుకున్నారు. మైనార్జీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.ఆనంద్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ పీఆర్‌ఈఐ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నర్సింహరావు ఉత్తర్వులు జారీ చేశారు.

డిప్యూటీ డీఈవో
మొదటగా ఈ విషయంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సంస్థ గుంటూరు సెక్రటరీ, జిల్లా కన్వీనర్ అదేవిధంగా మచిలీపట్నం డిప్యూటీ డీఈవో సుబ్బారావుతో కూడిన త్రీసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఆనంద్‌కుమార్ పాఠశాలలోని తన చాంబర్‌లో ఓ మహిళా ఉద్యోగినితో రాసలీలలుసాగించిన విషయం నిజమేనని నివేదిక ఇచ్చారు.

మహిళా ఉద్యోగిపై చర్యలు
అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని విధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఆనంద్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో ఫిర్యాదు
ఇదిలా ఉండగా అదే పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న షకీలా ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ తనను ఆయన కార్యాలయంలోకి పిలిచి బలవంతంగా లోబరచుకునేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. అటు విద్యార్థి ఇటు కంప్యూటర్ ఆపరేటర్ షకీలా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి ఆనంద్ కుమార్‌ను రిమాండ్ కు తరలించినట్లు సీఐ రాజశేఖర్ చెప్పారు.












Click it and Unblock the Notifications