ఎస్ఐ కళ్లల్లో కారం కొట్టి ఎర్రచందనం స్మగ్లర్లు దాడి: రివాల్వర్ తీయడం పరార్
చిత్తూరు: తిరుపతి పద్మావతిపురంలో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐపై ఎర్రచందనం స్మగర్లుగా అనుమానిస్తున్న దుండగులు దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున తిరుపతి పద్మావతిపురంలో ఎస్సై ఇంటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
శనివారం తెల్లవారుజామున ఇంటి నుంచి పాలకోసం బయటకు వచ్చిన ఎస్సైపై ఎర్రచందనం స్మగ్లర్లుగా భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు కారంపొడి చల్లారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. తేరుకున్న ఎస్సై తుపాకీతో ఎదురుదాడికి దిగడంతో దుండగులు పరారైయ్యారు.

స్వల్పంగా గాయపడిన అశోక్‌కి గరుడాద్రి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడంలో అశోక్ కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో జరిగిన 20 మంది ఎర్రచందనం దొంగల ఎదురుకాల్పుల ఘటనలో పాల్గొన్నారు. అప్పుడు జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో గాయాలతో ఆస్పత్రిలో చేరాడు.
ఎర్రచందనం దొంగలు దాడికి పాల్పడ్డారా... లేక, ఎవరైనా ఇతర వ్యక్తిగత కారణాలతో పాల్పడ్డారా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇటీవల పెద్ద ఎత్తున స్మగర్లను అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో వారే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దాడి ఘటనను సీరియస్‌గా ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. దాడులు జరిగినా స్మగ్లర్ల కోసం నిర్వహించే కూంబింగ్ ఆగబోదని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications