విద్యార్థినిపై లైంగిక వేధింపులు: టీచర్‌కి స్త్రీల దేహశుద్ధి

Assult
విశాఖపట్నం/చిత్తూరు: పాఠశాలలోని ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ ఉపాధ్యాయుడికి మహిళా సంఘాలు దేహశుద్ధి చేశాయి. ఈ ఘటన విశాఖపట్నంలోని గోపాలపట్నంలోని కొత్తపాలెంలో చోటు చేసుకుంది. ఎంపిపి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సింహాచలం అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై గత కొన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులతో చెప్పడంతో వారు మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఉపాధ్యాయుడు సింహాచలాన్ని చితకబాదారు. అనంతరం అతన్ని విశాఖపట్నంలోని ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.

సుమోను ఢీకొన్న రైలు: ఐదుగురు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని వాయల్పాడు మండలం ఇట్లంవారిపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఓ సుమోను గుంతకల్లు ప్యాసింజర్ రైలు ఢీకొంది. సుమో రైలు పట్టాలు దాతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

మృతులు గుర్రంకొండ మండలం రామాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కాగా రైల్వే కాపలా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. మరో ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా లేవేరు మండలం బుడుమూరు కూడలి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+