టీడీపీ ఎంపీటీసీ కిడ్నాప్, హత్య?, గుండెపోటు డ్రామాలతో ఆ కంపెనీ?
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కిడ్నాప్ కు గురికావడమే కాకుండా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగుల చేతిలో హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు కూడా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మీద ఆరోపణలు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
గంగాధర నెల్లూరు సమీపంలోని పాలసముద్రం మండలం నరసింహాపురంలో జగన్నాథరాజు నివాసం ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అయిన జగన్నాథరాజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్న జగన్నాథరాజు సొంతంగా ట్రాక్టర్లు, జేసీబీలు పెట్టుకుని వాటిని అద్దెకు ఇస్తున్నాడు. జేసీబీలు కొనుగోలు చేయడానికి ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో జగన్నాథరాజు అప్పు తీసుకున్నాడు.

ఆ డబ్బుతో జగన్నాథరాజు జేసీబీ కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జగన్నాథరాజు సకాలంలో ఫైనాన్స్ సంస్థకు కంతులు చెల్లించలేకపోయాడు. జగన్నాథరాజు చిత్తూరులో కొన్ని కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నాడు. ఏలూరు జిల్లా నూజువీడుకు చెందిన ఆ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పదిమంది రెండు కార్లలో జగన్నాథరాజు నివాసం ఉంటున్న గ్రామానికి వెళ్లారు.
ఆ తర్వాత జగన్నాథరాజు ఎక్కడ ఉన్నాడంటూ గ్రామస్తులను అడిగారు. జగన్నాథరాజు చిత్తూరులో ఉన్నాడని గ్రామస్తులు ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి చిత్తూరులో పని ముగించుకున్న తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జగన్నాథరాజు అతని జేసీబీ డ్రైవర్ శంకర్ కలిసి బైక్ లో గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకుడు జగన్నాథరాజును కిడ్నాప్ చేశారు.
ఆ తర్వాత జేసీబీ డ్రైవర్ శంకర్ జగన్నాథరాజు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. కొన్ని గంటల తర్వాత ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు జగన్నాథ రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. జగన్నాథరాజు గుండెపోటుతో చనిపోయాడని సమాచారం ఇచ్చారు. రుణం సకాలంలో చెల్లించలేదని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులే జగన్నాథరాజును కొట్టి చంపేశారని, ఆయనకు గుండెపోటు లేదని, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జీడి నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అనుమానస్పద స్థితిలో చనిపోవడంతో పోలీసులు అనేక కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications