ప్రియుడితో టాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డేటింగ్, ప్రేమ, ఎంగేజ్మెంట్, ఆపై బ్రేకప్స్ వంటి వ్యవహారాలు చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. వెండితెరపై మెరిసే నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ నటి సునయన ఎల్లా తన ప్రియుడితో విడిపోయినట్లు, వీరిద్దరి లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

నటి సునయన గత కొంతకాలంగా యూఏఈకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఖాలిద్ అల్ అమెరితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి లవ్ స్టోరీ కేవలం డేటింగ్‌కే పరిమితం కాకుండా ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్లింది. గతంలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను, ఇద్దరూ చేతులు కలిపిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో ఈ జంటకు నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి.

Kubera Actress Sunaina Yella Deletes Photos With Khalid Al Ameri Breakup Rumors Spark Online

అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. తాజాగా వీరిద్దరి బంధంలో విభేదాలు తలెత్తాయని.. అందుకే వీరిద్దరు విడిపోయారని సినీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ బ్రేకప్ వార్తలకు ఓ బలమైన కారణం ఉంది. సునయన తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన ప్రియుడితో దిగిన ఫోటోలన్నింటినీ ఒక్కొక్కటిగా డిలీట్ చేసింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ భాగస్వాములతో విడిపోయే ముందు సోషల్ మీడియాలో ఫోటోలు తొలగించడం లేదా అన్ ఫాలో చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సునయన కూడా అదే పంథాలో ఫోటోలు డిలీట్ చేయడంతో వీరి లవ్ స్టోరీ ఎండ్ అయిందనే వార్తలకు బలం చేకూరింది

ఇదిలా ఉండగా.. ఈ బ్రేకప్, ఫోటోల డిలీట్ వ్యవహారంపై అటు నటి సునయన కానీ.. ఇటు ఆమె ప్రియుడు ఖాలిద్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా స్పందించడానికి వారు ఇష్టపడతపోవడం గమనార్హం. అయినప్పటికీ సునయన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో మార్పులు చూసిన నెటిజన్లు మాత్రం వీరిద్దరి పెళ్లి ముచ్చట ఆగిపోయినట్లేనని ఫిక్స్ అయిపోతున్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సునయన ఎల్లా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. నటనపై ఉన్న ఆసక్తితో 2005లో తెలుగులో వచ్చిన 'కుమార్ వర్సెస్ కుమారి' అనే చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. 'కాదలిల్ విళుందేన్' అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ 'మాసిలామణి', 'వంశం', 'నీర్‌పరవై', 'సమర్' వంటి వరుస చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన 'కుబేర' సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్రలో మెరిసింది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ పరిణామం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+