నమ్మించి ఇంటర్ గర్ల్స్‌ను రేప్ చేసిన వ్యాపారి, అరెస్టు

A Traders rapes two inter girls
హైదరాబాద్: హైదరాబాదులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఇంటర్ విద్యార్థుల పైన ఓ చిరు వ్యాపారి అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భయపడి పారిపోయిన విద్యార్థినులను మభ్యపెట్టి అతను అత్యాచారం చేశాడు.

హైదరాబాదులోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులకు తాజా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఇంట్లోని పెద్దలకు భయపడిన ఆ అమ్మాయిలు పారిపోయి హైదరాబాదుకు వచ్చారు. వారిని జాగ్రత్తగా ఇంటికి పంపిస్తానని అతను చెప్పాడు.

దీంతో వారు అతని మాయమాటలు నమ్మారు. అతను వారి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దపడ్డారు. వీరిని గమనించిన పోలీసులు ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చిరు వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+