Viral Video: అమ్మను అరిగోస పెడుతున్న కొడుకు.. కాళ్లతో తంతూ.. పీకపై నొక్కుతూ..
అమ్మ.. సృష్టిలో గొప్పనైన పదం.. అమ్మ.. మన కోసం జీవించే నిస్వార్థ జీవి.. మన జీవితాన్నే తన జీవితంగా జీవిస్తుంది అమ్మ. కానీ నవమాసాలు మోసి, కనిపెంచిన అమ్మను ఓ కొడుకు ముప్పుతిప్పల పెడుతున్నాడు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాళ్లతో తన్నుతూ
పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి కాళ్లతో తన్నుతున్న వీడియో హృదయాన్ని కలిచివేస్తుంది. కడపులో ఉన్నప్పుడు కాళ్లతో తంతే ఆనందంగా మురిసిపోయిన అమ్మను.. ఇప్పుడు కాళ్లతో తన్నుతున్న కుమారుడిని చూస్తే.. ఇందుకేనా అమ్మ.. నువ్వు పురిటినొప్పులు పడి అతడిని కన్నావు.. అని అనిస్తుంది.
కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని పల్లెపాలెం గ్రామంలో దారుణం. మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న యువకుడు#Kakinada #AndhraPradesh #AndhraNews #OneIndiaTelugu pic.twitter.com/guobf0UfJf
— oneindiatelugu (@oneindiatelugu) September 26, 2022

తల్లి పీక పై కాళ్లు వేసి
ఆ కొడుకు తల్లి పీక పై కాళ్లు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంగా ప్రవర్తిస్తున్నాడు. తాగిన మత్తులో ఈ యువకుడు తన తల్లిని ఇలా చిత్ర హింసలకు గురిచేయడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగం పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసుకున్న బందువులు వృద్దురాలును యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications