జననేత పేరుతో జగన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన భారతి

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి సతీమణి వైయస్ భారతి.. ‘జననేత.కామ్'(jananeta.com) పేరిట ఓ వెబ్‌సైట్ ప్రారంభించారు. జగన్ తన అభిమానులకు మరింత చేరువకావాలనే ఆలోచనతోనే వెబ్‌సైట్ ప్రారంభించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని నిర్వాహకులు చెప్పారు.

వెబ్‌సైట్‌లో జగన్, ఆయన కుటుంబ సభ్యుల ప్రసంగాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. వెబ్‌సైట్‌లో వీడియోలను, ఫొటోలను వీక్షించడంతోపాటు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వెబ్‌సైట్‌ను పొన్నెకంటి శశికృష్ణ డెవలప్ చేశారు. జగన్ తన అభిమానులు, పార్టీ నాయకులకు నెట్ ద్వారా మరింత చేరువయ్యేందుకే వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు పొన్నెకంటి తెలిపారు.

YS Bharati

జననేత వెబ్‌సైట్ జగన్ అభిమానులకు ఆస్తిలా ఉంటుందని, జగన్ ప్రసంగాలను ఎప్పకప్పుడు అప్‌డేట్ చేయడం వల్ల అభిమానులు జగన్ ప్రసంగాలను వెబ్‌సైట్ ద్వారా వీక్షించవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్మోహర్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోనే కాక దేశం, అంతర్జాతీయంగానూ జగన్‌కు అభిమానులున్నారని, వారందరికి దగ్గరయ్యేందుకే వెబ్‌సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పొన్నెకంటి శశికృష్ణ తెలిపారు. ఇటీవలే జగన్ బెయిల్‌పై చంచల్‌‌గూడ జైలు నుంచి విడుదులైన విషయం తెలిసిందె. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+