భర్త నుంచి కాపాడండి: ఎస్ఐ భార్య ఫిర్యాదు
హైదరాబాద్/చిత్తూరు: తనను చంపుతానని బెదిరిస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ ఎస్‌ఐ భార్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ 29వ తేదీలోగా విచారణ నివేదిక కమిషన్‌కు అందజేయాలని చిత్తూరు జిల్లా అర్బన్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా శిరుగుప్ప గ్రామానికి చెందిన బాధితురాలు హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తనకు మొదటి భర్తతో ఉన్న విభేదాల కారణంగా ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన వరుసకు మేన బావ అయ్యే పటికె గణేష్‌రావును శ్రీశైలంలో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతి అలిపిరిలో ఎస్‌ఐగా పని చేస్తున్న అతను వివాహానికి ముందు, అనంతరం పలు లక్షల రూపాయలను కట్నంగా తీసుకున్నాడన్నారు.

ఇప్పుడు రెండో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తనను అడ్డుతొలగించుకునేందుకు వేధింపులకు గురిచేయడంతో పాటు ఐదు ఎకరాల భూమిని రాయించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ నిర్వహించి తనకు, పిల్లలకు రక్షణ కలిపించేలా ఆదేశాలు జారీ చేయాలని హెచ్‌ఆర్సీని కోరినట్లు తెలిపారు.
నదిలో దూకి ఆత్మచేసుకున్న ముగ్గురు మహిళలు
కృష్ణానదిలో దూకి ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజిపై చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న మహిళలంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నదిలోంచి మృతదేహాలను వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications