ఆమెను 17 చోట్ల పొడిచాడు ,ఎందుకంటే?

తనతో కాకుండా వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో చంద్రశేఖర్ అనే వ్యక్తి తనతో సహజీవనం సాగిస్తున్న మహిళపై కత్తితో 17 చోట్ల పొడిచాడు.

కాకినాడ :సహజీవనం చేస్తోన్న మహిళపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. విచక్షణరహితంగా కత్తితో ఆమెను పొడిచాడు. ఆమె శరీరంపై 17 చోట్ల కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటుచేసుకొంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్ పేటలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎల్విన్ పేటకు చెందిన ధనలక్ష్మి, చంద్రశేఖర్ లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ధనలక్ష్మిపై అతను అనుమానం పెంచుకొన్నాడు.

ఈ అనుమానంతో ఆయన ఆమెను అంతం చేయాలని భావించాడు. సోమవారం ఉదయం తన సోదరితో కలిసి సైకిల్ పై వస్తోన్న ఆమెపై ఆయన దాడి చేశాడు. కత్తితో ఆమెపై విచక్షణరహితంగా దాడి చేశాడు.

a woman stabbed 17 times by a man

ధనలక్ష్మి శరీరంపై 17 చోట్ల కత్తితో పొడిచాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ధనలక్ష్మి సోదరి ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించింది. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ధనలక్ష్మి వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ చనువుగా ఉంటుందనే అక్కసుతోనే చంద్రశేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+