వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Snake Bite: నాగుపాముతో నాటకాలా.. యువకుడి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..

నాగుపాముతో సెల్ఫీ తీసుకునేందుక యత్నించిన యువకుడి ప్రాణాలు పోయాయి. అస్సలు ఏం జరిందంటే..

|
Google Oneindia TeluguNews

చాలా మంది క్రేజీ కొన్ని పనులు చేస్తుంటారు. కానీ ఈ పనుల ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఓ యువకుడు నాగుపాముతో సెల్ఫీ తీసుకునే క్రమంలో కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. మంగళవారం రాత్రి కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో ఈ ఘటన జరిగింది.

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి కందుకూరులోని జేఏ కాంప్లెక్స్‌లో ఓ షెట్టర్ ను అద్దెకు తీసుకుని అందులో జ్యూస్‌ షాపు నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో అక్కడి పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి వెళ్లాడు.

వెంకటస్వామి వద్ద నాగుపాము ఉంది. ఆ పామును చూసిన మణికంఠరెడ్డి సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఈ సెల్ఫీ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతాయని అనుకున్నాడు. వెంకటస్వామి పాము విషం తీసానని చెప్పడంతో మణికంఠరెడ్డి వెంటనే పామును మెడలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పాము జారి కిందపడిపోయింది.

A young man lost his life trying to take a selfie with a cobra

ఈ వెంటనే మణికంఠ పాము తోక పట్టుకునేందుకు ప్రయత్నంచగా.. పాము ఒక్కసారిగా పైకి లేచి వెనుదిరిగి మణికంఠరెడ్డిని కాటు వేసింది. దీంతో అతన్ని స్నేహితులు స్థానికంగా ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. మణికంఠ రెడ్డి ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఒంగోలు తరలిస్తుండగా.. దారిలోనే ప్రాణాలు విడిచాడు.

వెంకటస్వామి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడని మణికంఠ రెడ్డి స్నేహితులు చెప్పారు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని వెంకటస్వామి చెప్పాడని వివరించారు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడని వివరించారు.

పాము కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని వెంకట స్వామి చెప్పినట్లు తెలిపారు.
అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్‌ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

English summary
Many people do some crazy things. But sometimes lives have to be lost in these works. Recently, a young man was bitten while taking a selfie with a cobra and lost his life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X