తనకంటే 30 ఏళ్లు పెద్దదైన మహిళను...కోరిక తీర్చమన్న అపరిచితుడు:ఒప్పుకోలేదని నీటిలో ముంచి చంపేశాడు
కృష్ణా జిల్లా:కామాంధుడు...మృగాడు అనే పదాలకు నిఖార్సైన నిదర్శనం ఆ యువకుడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఈ నీచుడు...తనకు పరిచయమే లేని...అందులోను తన కంటే 30 ఏళ్లు పెద్దదైన ఒక స్త్రీని తన కోరిక తీర్చమని అడిగాడు.
అయితే ఆమె అందుకు నిరాకరించడంతో పాటు పెద్దగా అరవడంతో ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తరువాత శవం బైటపడకుండా పంట పొలంలోనే పూడ్చి పెట్టాడు. అయితే పంటకాల్వలో శవం పైకి తేలడంతో పోలీసులు సమాచారం అందుకొని కేసు నమోదు చేశారు. ఆ తరువాత తమకు దొరికిన కొద్దిపాటి సమాచారంతో హంతకుడిని అరెస్ట్ చేసి ఆ హత్య కేసు వెనుక మిస్టరీ చేధించారు. కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

తనకు ఏమాత్రం పరిచయమే లేని మహిళ...అందులోనూ తన కంటే ఎన్నో ఏళ్ల పెద్దదైన మహిళ చేపల అమ్మకం కోసమని పొరుగూరు వస్తే ఆమెపై కన్నేసిన యువకుడు తన కోరిక తీర్చలేదని ఆమెని దారుణంగా హతమార్చిన వైనం గురించి మీడియా సమావేశంలో గుడివాడ సీఐ డి.శివశంకర్ వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం...కృష్ణా జిల్లా బందరు రూరల్ మండలం తుమ్మలపాలేనికి చెందిన డొక్కు గోపాలరావు భార్య డొక్కు రామలక్ష్మి(50) బందరులో చేపలు, రొయ్యలు కొనుగోలు చేసి పామర్రు మండల గ్రామాల్లో విక్రయించేది.
ఆ క్రమంలో ఈనెల 11న నిభానుపూడిలో ఆమె చేపలు అమ్మేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు స్టేషన్ కు వెళుతుండగా ఆమెపై కొంతకాలంగా కన్నేసిన తోకల అనిల్‌కుమార్ (22) అనే యువకుడు రామలక్ష్మిని అనుసరిస్తూ వస్తున్నాడు. ఆమెను జనసంచారం లేని చోట అడ్డగించి తన కోరిక తీర్చాలని అడగ్గా ఆమె ఆ అపరిచిత యువకుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ తరువాత పెద్దగా కేకలు వేస్తూ పారిపోయేందుకు ప్రయత్నించింది,
దీంతో ఆమె పారిపోతే తన గురించి బైటపెడుతుందని భావించిన అనిల్ కుమార్ ఆమెను వెంటాడి పంట కాల్వలోకి తోశాడు. ఆమె నీళ్లలో పడి కేకలు వేస్తుండటంతో
ఆమెను సమీపించి అరవకుండా గొంతు నులుముతూ నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తరువాత మృతదేహం కనిపించకుండా పక్కన మరో పంట కాల్వలోకి తోశాడు. పెనుగులాడలో తొలిగిపోయిన ఆమె చీరను కాల్వ ఒడ్డున ఉన్న ఒక గడ్డి మొక్కకు చుట్టి అక్కడ నుంచి పరారయ్యాడు.
ఆ తరువాత పంటకాల్వలో మృతదేహం పైకి తేలిన క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విచారణా క్రమంలో లభించిన కొద్దిపాటి సమాచారంతో అనిల్‌కుమార్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. పామర్రు మార్కెట్‌యార్డ్ సమీపంలో సంచరిస్తున్న అతడిని అరెస్టు చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications