మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోడీ..! ఇటలీ ప్రధాని మెలోనీ రియాక్షన్ ఇదే..!
భారత ప్రధాని మోడీ (PM Modi) ఐదు యూరప్ దేశాల పర్యటన చివరి అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ ఇటలీ రాజధాని రోమ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీని (Georgia Meloni) కలుసుకున్నారు. ఆమెతో కాసేపు ఆహ్లాదంగా గడపడంతో పాటు ఫొటోలు కూడా తీసుకున్నారు. అనంతరం ఆమెకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అదే మెలోడీ చాక్లెట్ (Melody Toffee). భారత్ లో చిన్న పిల్లలు తినే మెలోడీ చాక్లెట్ బాక్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దీనిపై మెలోనీ స్పందించారు.
ప్రధాని మోడీ ఇచ్చిన ఈ ప్రత్యేక బహుమతికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటలీ ప్రధాని ఓ సరదా వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. "బహుమతికి ధన్యవాదాలు" అని రాస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోలో, ఇటలీ ప్రధాని మెలోననీ స్వయంగా, "ప్రధాని మోడీ బహుమతిగా చాలా మంచి టాఫీని — మెలడీని తెచ్చారు" అని పేర్కొన్నారు. మోడీ, మెలోని అనే రెండు ఇంటిపేర్ల కలయికతో ఏర్పడిన 'మెలోడీ' పదం గతంలో వీరి సమావేశాలలో బాగా ప్రాచుర్యం పొంది, ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది.

అంతకు ముందు ఇటలీ రాజధాని రోమ్‌కు ప్రధాని మోడీ చేరుకోగానే, మెలోని ఆయన్ను ఎక్స్ లో ఆత్మీయంగా ఆహ్వానించారు."రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా!" అంటూ మోడీ ఫొటోలు షేర్ చేశారు. ఇటలీ రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత ప్రధాని మోడీ.. మెలోనీని కలుసుకున్నారు. డిన్నర్ అనంతరం ఇద్దరు నేతలు సుప్రసిద్ధ కొలోసియం గుండా నెమ్మదిగా నడిచారు. ఈ ఫొటోల్ని పంచుకుంటూ, ప్రధాని మోడీ .. "రోమ్ చేరుకోగానే, డిన్నర్‌లో ప్రధాని మెలోనిని కలుసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత సుప్రసిద్ధ కొలోసియంను సందర్శించాం. మేము విస్తృతమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. భారతదేశం-ఇటలీ స్నేహాన్ని ఎలా పెంపొందించాలో అనే సంభాషణను నేటి చర్చల్లో కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాను" అని తెలిపారు.













Click it and Unblock the Notifications