ప్రియురాలిని బావిలో తోసి.. ప్రియుడి ఆత్మహత్య

గుంటూరు: జిల్లాలోని అమృతలూరు మండలం మూల్పూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించానంటూ ఓ బాలికను నమ్మించిన యువకుడు, ఆమెను బావిలోకి తోసేశాడు. ఆ తర్వాత ఆ యువకుడు కూడా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా, బావిలోంచి ప్రాణాలతో బయటపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బావిలో నుంచి యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు.

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం ఇద్దరు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రహదారి పక్కన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ లోడుమీద కూర్చున్న ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కోమరోలు మండలం ముత్రాసుపల్లె వద్ద చోటు చేసుకుంది.

A youth allegedly murdered his girl friend in guntur

రైలు పట్టాల సమీపంలో మృతదేహం

నెల్లూరు: జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో బుధవారం రైలు పట్టాల సమీపంలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. అది కోవూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం సమీపంలో నివసించే పరిటాల వెంకట సురేష్‌దిగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. సురేష్‌ నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్‌లో పని చేస్తున్నాడు. డిసెంబర్ 16న విజయవాడకు వెళుతున్నానని భార్య సుమతో చెప్పి వెళ్లాడు. బుధవారం వెంకటేశ్వరపురం సమీపంలోనిరైల్వేట్రాక్‌ సమీపంలో విగతజీవిగా పడివున్నాడు.

అతను రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+