చంద్రబాబుకు శివసేన బిగ్ అలర్ట్- ఈ పదవి తీసుకోకుంటే భారీ నష్టం..!!

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఏపీలో మూడు పార్టీల ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేంద్రంలో స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. ఈ కూటమిలో టీడీపీ కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కానుంది. ఈ సమయంలోనే చంద్రబాబుకు శివసేన కీలక హెచ్చరిక చేసింది. కీలక పదవిని సూచించింది. గత అనుభవాలతో తాము ఈ సూచన చేస్తున్నట్లు వెల్లడించింది.

ఎన్డీఏలో టీడీపీ
రేపు (9న) కేంద్రంలో మోదీ మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ సారి ఎన్డీఏలో టీడీపీ, జనతాదళ్(యు) కీలకంగా మారాయి. ఎన్డీఏ పక్ష నేతగా ప్రధానిగా మోదీ ని ఈ రెండు పార్టీల అధినేతలు ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఇక..కేంద్రంలో ఈ రెండు పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. రెండు పార్టీలకు మంత్రి పదవులు ఖాయం అయ్యాయి. తొలుత టీడీపీ స్పీకర్ పదవి కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రతిపక్షం బలంగా ఉండటంతో బీజేపీ తామే స్పీకర్ పదవి తీసుకుంటామని స్పస్టం చేసారు. ఇప్పుడు ఇదే విషయం పైన శివసేన నేత..మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కీలక హెచ్చరిక చేసారు.

Aaditya Thakrey Alerts TDP Chief Chandra Babu suggest to get the post of the speaker As NDA Partner

ఆదిత్య థాక్రే సూచన
టీడీపీ, జేడీయూ తప్పనిసరిగా లోక్‌సభ స్పీకర్‌ పోస్టు కోరుకోవాలని ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి తన మిత్రపక్షాలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తాము బీజేపీ కుయుక్తులను చూసిన అనుభవంతో చెబుతున్న మాట అని ఆయన 'ఎక్స్‌' వేదికగా సూచించారు. అందుకే స్పీకర్‌ పోస్టు తీసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతున్న పార్టీలను తాను సవియంగా కోరుతున్నట్లు యువనేత వెల్లడించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీల్చిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. 'ఎక్స్‌'లో టీడీపీ, జేడీయూలను ట్యాగ్ చేస్తూ.. చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

స్పీకర్ పదవి దక్కేనా
అయితే, తాజాగా కేంద్రంలో టీడీపీకి ఇచ్చే మంత్రి పదవుల పైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీకి మూడు కేంద్ర స్థానాలు, బీజేపీ - జనసేనకు చెరో పదవి ఇవ్వటం ఖాయమని చెబుతున్నారు. అయితే, జాతీయ స్థాయిలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న రాజకీయాలు...గతంలో బీజేపీ, జేడీ(యూ), టీడీపీ మధ్య గతంలో సంబంధాల అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. తమకు పదవుల కంటే ఏపీలో తమ లక్ష్యాల సాధన కోైసం కేంద్రం మద్దతు అవసరమని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలో ఆదిత్య థాక్రే చేసిన సూచన పైన చర్చ ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+